సినీ నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం

Published : Aug 02, 2020, 06:45 AM IST
సినీ నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల కలకలం

సారాంశం

మనాలీలోని తన ఇంటి వద్ద తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని అంటున్నారు.

న్యూఢిల్లీ: సినీ నటి కంగనా రనౌత్ ఇంటి వద్ద కాల్పుల శబ్దం వినిపించింది. దాంతో కలకలం చెలరేగింది. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో కంగనా ఇంటి వద్ది ఆ సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి తాను ఇంట్లో ఉన్నప్పుడు రాత్రి పదకొండున్నర ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించినట్లు కంగనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దాంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు కారణాలేమిటనేది తెలియరాలేదు. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో తాను ఇచ్ిచన ప్రకటనతో తనను భయపెట్టడానికి ఇలా చేసిన ఉంటారని కంగనా అభిప్రాయడింది.

ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆమె స్పష్టం చేసింది. కావాలనే కాల్పులు జరిపారని, తన గదికి ఎదురుగా ఉన్న సరిహద్దు గోడకు ఆవల ఎవరో ఉన్నట్లు అనిపించిందని ఆమె చెప్పింది. 

ఇదిలావుంటే, సుశాంత్ ఆత్మహత్యకు ప్రేరేపించిందంటూ రియా చక్రవర్తిపై పాట్నాలో నమోదైన కేసును ముంబైకి బదిలి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ ఆగస్టు 5వ తేీదన విచారణకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?