టాక్సీ వాలా కు మెగాస్టార్ విషెస్!

Published : Nov 28, 2018, 04:50 PM ISTUpdated : Nov 28, 2018, 04:59 PM IST
టాక్సీ వాలా కు మెగాస్టార్ విషెస్!

సారాంశం

మంచి సినిమాలు విడుదలైతే మెగాస్టార్ చిరంజీవి తన మద్దతుతో సపోర్ట్ చేస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సారి టాక్సీ వాలా చిత్ర యూనిట్ ను ఆయన ప్రత్యేకంగా కలుసుకొని అభినందించారు. 

మంచి సినిమాలు విడుదలైతే మెగాస్టార్ చిరంజీవి తన మద్దతుతో సపోర్ట్ చేస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సారి టాక్సీ వాలా చిత్ర యూనిట్ ను ఆయన ప్రత్యేకంగా కలుసుకొని అభినందించారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన టాక్సీ వాలా ఈ నెల 19న రిలీజైన సంగతి తెలిసిందే.

 

హారర్ కామెడీ అంశంతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 30 కోట్ల వరకు కలెక్ట్ చేసి మంచి లాభాలను అందించింది. ఇక ప్రేక్షకుల మన్ననలను పొందిన ఈ సినిమా చిత్ర యూనిట్ మెగాస్టార్ కోరికమేరకు ప్రత్యేకంగా కలుసుకున్నారు. 

చిత్ర నిర్మాత ఎస్ కెఎన్ దర్శకుడు రాహుల్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మెగాస్టార్ ను కలుసుకొని ఆయన నుంచి ప్రశంసలను అందుకున్నారు. అందరికి విషెస్ అందించి కెరీర్ లో ఇంకా గొప్ప స్థాయికి చేరుకోవాలని అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.  

PREV
click me!

Recommended Stories

30 కోట్లు బడ్జెట్, 50 కోట్లకు డీల్, బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న డీమోంటె కాలనీ 3
ది గర్ల్ ఫ్రెండ్ నటుడి నుంచి క్రేజీ మూవీ, ఓజీ విలన్ నుంచి అదిరిపోయే థ్రిల్లర్.. ఓటీటీలో ఈ వారం సినిమాలు ఇవే