ఓ అవ్వ కోసం లారెన్స్ ఇల్లు.. నువ్ దేవుడివి సామీ!

Published : Nov 28, 2018, 04:35 PM IST
ఓ అవ్వ కోసం లారెన్స్ ఇల్లు.. నువ్ దేవుడివి సామీ!

సారాంశం

నిత్యం ఎదో ఒక సహాయం చేస్తూ ఉండే రాఘవ లారెన్స్ ఇప్పుడు గజ తుపాను బాధితులకు తనవంతు సహాయాన్ని అందిస్తున్నాడు. 

ఇటీవల గజ తుపానుతో తమిళనాడులో పలు గ్రామాలూ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. అయితే నిత్యం ఎదో ఒక సహాయం చేస్తూ ఉండే రాఘవ లారెన్స్ ఇప్పుడు గజ తుపాను బాధితులకు తనవంతు సహాయాన్ని అందిస్తున్నాడు. 

ఒక వృద్ధురాలు ఇల్లు పోగొట్టుకొని ఒక గుడిసెలో దీన పరిస్థితిని గడపడం చూసి లారెన్స్ గుండె చలించింది. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన వీడియోను చూసి వెంటనే ఆమెకు ఇల్లు కట్టిస్తాను అని మాట ఇచ్చాడు. చెప్పిన విధంగానే నేడు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాడు. అందుకు సంబందించిన పోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 

నేను ఈ తల్లికి మొదటి ఇల్లు కట్టి ఇవ్వబోతున్నట్లు అని చెబుతూ ఆ అమ్మ పరిస్థితి గురించి తనకు తెలిసేలా చేసిన వారికి కృతజ్ఞతలని రాఘవ ట్వీట్ చేశారు. ఇటీవల చిన్నారులకు సంబందించిన హార్ట్ సర్జరీలను 151 వరకు పూర్తి చేసి తన మంచి తనాన్ని చాటుకున్నాడు ఈ రియల్ హీరో. దీంతో అభిమానులు నువ్ దేవుడువి సామి అంటూ కొనియాడుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు