చిరు మీసం తీస్తే.. అర్దం అదా?

Published : Jul 19, 2020, 07:24 PM IST
చిరు మీసం తీస్తే.. అర్దం అదా?

సారాంశం

కరోనా లాక్ డౌన్ తో విరామం లభించిన సమయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓవైపు సీసీసీ ద్వారా సినీ కార్మికులకు అవసరమైన సేవలు అందిస్తూనే, మరోవైపు ఇంటి వద్ద అనేక చిత్రాలను చూస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని చూసి ముగ్ధులయ్యారు.

చూస్తూంటే చిరంజీవి ఆచార్య చిత్రం షూటింగ్ ఇప్పుడిప్పుడే మొదలయ్యేటట్లు కనపడటం లేదు. చిరంజీవి చాలా కూల్ గా ఈ బ్రేక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం మనకు తాజాగా బయిటకు వచ్చిన ఆయన కొత్త ఫొటోతో అర్దమవుతోంది. ఈ ఫొటోలో క్లీన్ షేవ్ తో చిరంజీవి కనపించారు. ఆచార్య గెటప్ కు కావాల్సిన గెడ్డం లేదు. అంటే ఇంకా ఆచార్య షూటింగ్ మొదలు కావటానికి టైమ్ పడుతుంది అని అర్దమవుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఆచార్య చిత్రం ఆగస్ట్ 2021 కు ఫోస్ట్ ఫోన్ అయ్యింది. 
 
ఇక  కరోనా లాక్ డౌన్ తో విరామం లభించిన సమయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓవైపు సీసీసీ ద్వారా సినీ కార్మికులకు అవసరమైన సేవలు అందిస్తూనే, మరోవైపు ఇంటి వద్ద అనేక చిత్రాలను చూస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో సత్యదేవ్ నటించిన బ్లఫ్ మాస్టర్ చిత్రాన్ని చూసి ముగ్ధులయ్యారు.

అంతేకాదు బ్లఫ్ మాస్టర్ చిత్రదర్శకుడు గోపీ గణేశ్ ను తన నివాసానికి పిలిపించుకుని మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎంతో కొత్తగా కనిపించారు. సాధారణంగా చిరుగడ్డం, మీసాలతో దర్శనమిచ్చే మెగాస్టార్... యువ దర్శకుడు గోపీ గణేశ్ తో ఫొటోలో మీసాల్లేకుండా దర్శనమిచ్చారు.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu: గేటు బయటే శ్రీవల్లి తల్లిదండ్రులకు అవమానం..ప్రేమ హార్ట్ బ్రేక్ చేసిన ధీరజ్
Anil Ravipudi Remuneration : చిరంజీవి వల్ల రెమ్యునరేషన్ భారీగా పెంచిన అనిల్ రావిపూడి ? నెక్ట్స్ మూవీకి ఎంత?