శ్రీవిష్ణు 'సామజవరగమన' ట్రైలర్ ఇదిగో, లాంచ్ చేసిన చిరు.. కంప్లీట్ ఫన్

Published : Jun 25, 2023, 08:41 PM IST
శ్రీవిష్ణు 'సామజవరగమన' ట్రైలర్ ఇదిగో, లాంచ్ చేసిన చిరు.. కంప్లీట్ ఫన్

సారాంశం

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు. శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ 'సామజవరగమన'. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. 

జూన్ 29న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయింది. ఈ సందర్భంగా సామజవరగమన చిత్ర యూనిట్ చిరంజీవిని ఆయన ఆఫీస్ లో కలుసుకున్నారు. చిరు ట్రైలర్ లోని ఫన్ మూమెంట్స్ ని బాగా ఎంజాయ్ చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు ఇతర చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. 

శ్రీవిష్ణు షర్ట్ పై చిరు తన ఆటోగ్రాఫ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ పంచ్ పంచ్ లతో ఆకట్టుకునే విధంగా ఉంది. క్లీన్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనే వైబ్స్ కనిపిస్తున్నాయి. 

సీనియర్ నటుడు నరేష్, కమెడియన్ సుదర్శన్, వెన్నెల కిషోర్ ఇంకా పలువురు హాస్య నటులు ఈ చిత్రంలో ఉన్నారు. 'ఎప్పుడైనా ఏదైనా పనికొచ్చే పని చేశావా.. చెత్త నుంచి కూడా కరెంట్ తీస్తున్నారు' అంటూ శ్రీవిష్ణు తన తండ్రి నరేష్ పై సెటైర్లు వేసే ఫన్నీ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. 

ఈచిత్రంలో శ్రీవిష్ణుకి జోడిగా యంగ్ బ్యూటీ రెబ్బా జాన్ నటించింది. రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీత అందించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా