పూరి జగన్నాధ్ పై చిరంజీవి ప్రేమ తగ్గలేదుగా.. మెగాస్టారే అడిగి మరీ!

Published : Jul 25, 2019, 04:00 PM IST
పూరి జగన్నాధ్ పై చిరంజీవి ప్రేమ తగ్గలేదుగా.. మెగాస్టారే అడిగి మరీ!

సారాంశం

పూరి జగన్నాధ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. వరుస ప్లాపులతో టాప్ లీగ్ దర్శకుడనే బ్రాండ్ కు దూరమవుతున్న సమయంలో పూరి జగన్నాధ్ జూలు విదిల్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హీరో రామ్ ని పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో పూర్తి మాస్ అవతారంలో చూపించాడు. 

పూరి జగన్నాధ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. వరుస ప్లాపులతో టాప్ లీగ్ దర్శకుడనే బ్రాండ్ కు దూరమవుతున్న సమయంలో పూరి జగన్నాధ్ జూలు విదిల్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హీరో రామ్ ని పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో పూర్తి మాస్ అవతారంలో చూపించాడు. పూరి మార్క్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బావుండడంతో ఈ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. 

ఇదిలా ఉండగా ఓ ఆసక్తికర వార్త అటు మెగా అభిమానులని, పూరి ఫ్యాన్స్ ని సంతోషానికి గురిచేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని చూడబోతున్నారట. గురువారం రోజు ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ చిరంజీవికి స్పెషల్ గా ఈ చిత్రాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని చూడాలని చిరు చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో పూరి జగన్నాధ్ ది ప్రత్యేకమైన శైలి. అందుకే ప్రతి హీరోకి పూరి దర్శకత్వం పట్ల ఆసక్తి ఉంటుంది. 

వాస్తవానికి చిరంజీవి 150వ చిత్రం పూరి దర్శకత్వంలోనే ఉండాల్సింది. అప్పట్లో ప్రకటన కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ పూరి చేదాటిపోయింది. ఆ సమయంలో పూరి కొంత నిరాశకు లోనయ్యారు. చిరు ఇస్మార్ట్ శంకర్ చిత్రం చూసేందుకు రెడీ అవుతున్నారు. దీనితో పూరి పై చిరంజీవి ప్రేమ ఇంకా తగ్గలేదని.. వీరి కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?