పంచభూతాల సాక్షిగా 'విశ్వంభర' విధ్వంసం.. ఉత్కంఠ పెంచుతున్న ఇంటర్వెల్ ఫైట్ డీటెయిల్స్

By tirumala ANFirst Published Apr 3, 2024, 3:14 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందుతోంది. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా రూపొందుతోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ ఆ తరహా ఫాంటసీ జోనర్ లో నటిస్తున్న చిత్రం ఇదే. ముల్లోకాలు చుట్టూ ఈ కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ చిత్రంలో వీరుడిగా నటించే చిరంజీవి ఏ లక్ష్యం కోసం పోరాడబోతున్నాడు, ఈ చిత్ర కథలోని కీలక అంశం ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్స్. కానీ అప్పుడప్పుడూ వస్తున్న కొన్ని లీకులు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడు వసిష్ఠ భారీ ఇంటర్వెల్ పోరాట సన్నివేశాన్ని చిరంజీవిపై చిత్రీకరిస్తున్నారు. 

విజువల్ ఎఫెక్ట్స్ పూర్తయ్యాక ఇంటర్వెల్ ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉండాలని వసిష్ఠ ప్లాన్ చేసుకున్నారట. ఈ పోరాట సన్నివేశంలో పంచభూతాలు నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ప్రధాన భూమిక పోషిస్తాయని అంటున్నారు. ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు పంచభూతాలు సహకరిస్తాయని అంటారు. 

విశ్వంభరలో  చిరంజీవికి పంచ భూతాలు ఎందుకు సహకరిస్తాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ మొత్తం ఇంటర్వెల్ సన్నివేశం షూటింగ్ మాత్రమే ఉంటుందట. ఆల్రెడీ దర్శకుడు ఒక ఫైట్ సీన్ షూటింగ్ పూర్తి చేశారట. త్రిషతో సాంగ్ కూడా కంప్లీట్ అయింది. 

మిగిలిన షూటింగ్ కూడా త్వరలో పూర్తి చేసి 6 నెలల పాటు డైరెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పైనే కూర్చోబోతున్నట్లు టాక్. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 

click me!