హాస్పిటల్ లో కన్నడ సూపర్ స్టార్, అస్వస్థతకు గురైన శివరాజ్ కుమార్.. ఆందోళనలో అభిమానులు..

Published : Apr 03, 2024, 03:11 PM IST
హాస్పిటల్ లో కన్నడ సూపర్ స్టార్, అస్వస్థతకు గురైన శివరాజ్ కుమార్.. ఆందోళనలో అభిమానులు..

సారాంశం

ఈమధ్య సౌత్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్న  కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఇంతకీ ఆయనకు ఏమయ్యింది.   


శివరాజ్ కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలో  సూపర్ స్టార్ గా ఎదిగాడు.  అలనాటి నటుడు రాజ్ కుమార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి. ఆయన.. ఆతరువాత తనకంటూ ఓ ప్రత్యే ఇమేజ్ సాధించాడు. కన్నడ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగు వెలిగారు. రీసెంట్ గా ఆయన అనారోగ్యం పాలు అవ్వడం ప్యాన్స్ ను కలవరపెడుతోంది. ఆయన తన  భార్య కోసం ప్రచారం చేస్తూ హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం రేపింది.

కన్నడ నటుడు రాజ్ కుమార్ కుమారుడు శివరాజ్ కుమార్ ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు. ఈమధ్య కన్నడతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఎక్కువగా తమిళంలో కనిపిస్తున్నారు శివరాజ్ కుమార్. .. బిజీ షూటింగుల మధ్య...శివమోహ నియోజక వర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తన సతీమణి గీతా శివరాజ్‌కుమార్‌కు ప్రచారం కూడా ప్రారంభించారు.

ప్రచారం చేస్తుండగా..  ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అనంతరం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి సోమవారం డిశ్చార్జి చేశారు. షూటింగ్ సైట్‌లో దుమ్ము ఎక్కువగా ఉండటం వల్లే అనారోగ్యం కలిగిందని..  వైద్యులు తెలిపినట్లు సమాచారం.వైద్యుల సలహా మేరకు ఆయన మందులు వాడి  కొంత కాలం రెస్ట్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఆయన ఈమధ్య కాలంలో..  సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ వంటి చిత్రాల్లో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Sivaji VS Anasuya: ఆ విధంగా అనసూయ రుణం త్వరలోనే తీర్చుకుంటా..ఈసారి ఇంకా ఘాటుగా శివాజీ కామెంట్స్
OTT: పూజ ఎవ‌రు? ఆ ప‌ర్సుతో ఆమెకు సంబంధం ఏంటి.? ఓటీటీని షేక్ చేస్తున్న మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్