పెద్దరికం అనుభవించాలని లేదు.. కోరుకున్న దానికంటే భగవంతుడు ఎక్కువే ఇచ్చాడు: చిరంజీవి కీలక వ్యాఖ్యలు

Published : Dec 29, 2022, 01:10 PM ISTUpdated : Dec 29, 2022, 01:31 PM IST
 పెద్దరికం అనుభవించాలని లేదు.. కోరుకున్న దానికంటే భగవంతుడు ఎక్కువే ఇచ్చాడు: చిరంజీవి కీలక వ్యాఖ్యలు

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దరికం అనుభవించాలనే కోరిక తనకు లేదని చెప్పారు. అలా ఉండబోనని అన్నారు. అవసరం వచ్చినప్పుడు మాత్రం భుజం కాస్తానని తెలిపారు. 

మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దరికం అనుభవించాలనే కోరిక తనకు లేదని చెప్పారు. అలా ఉండబోనని అన్నారు. అవసరం వచ్చినప్పుడు మాత్రం భుజం కాస్తానని తెలిపారు. చిత్రపూరి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని చిరంజీవి ప్రారంభించారు. లబ్దిదారులకు ఇంటి పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

తనను సి కల్యాణ్, భరద్వాజ్ లాంటి వాళ్లు.. సినిమా పరిశ్రమ పెద్దోడు అంటున్నారని.. అయితే వాళ్లు తనకంటే చిన్న అనిపించుకునేందుకు పెద్ద చేస్తున్నారని చమత్కరించారు. వాళ్లు పెద్దలని.. వాళ్లకు సపోర్ట్‌గా తాను ఉంటానని చెప్పారు. సినిమా కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని  చెప్పారు.  తనకు కోరుకున్న దానికంటే భగవంతుడు ఎక్కువే ఇచ్చాడని చెప్పారు. సినీ పరిశ్రమ కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పారు. 

Also Read: నీ టైమ్ మారి పెద్దోడివి అయి ఉండోచ్చు.. చిరంజీవి ఎప్పుడు అక్కడే ఉంటాడు: సంచలనంగా మారిన నాగబాబు కామెంట్స్..

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు ఈ అద్భుతమైన కాలనీకి శంకుస్థాపన జరిగిందన్నారు. తాను కొంచెం బిజీగా ఉన్న వాళ్లు ఈరోజుకున్న విశిష్టత గురించి చెప్పడంతో.. తాను ఇక్కడ ఉండాలని వచ్చినట్టుగా చెప్పారు. కొన్నేళ్ల క్రితం సింగిల్ బెడ్ రూమ్ ఇళ్లు అప్పజెప్పినప్పుడు కూడా తాను వచ్చానని గుర్తుచేశారు. ఇన్నేళ్ల తర్వాత మధ్యలో కొంత నత్తనడన సాగిన.. కొత్తగా వచ్చిన అనిల్, దొరై సారథ్యంలో నిజాయితీతో వ్యవహరించిందని అన్నారు. అనిల్, దొరై కష్టపడి గృహా సముదాయం పూర్తి చేశారని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి వంటివారి దూరదృష్టి వల్లే కార్మికుల సొంతింటి కల సాకారం అయిందని అన్నారు. ఇందుకు ఆయా ప్రభుత్వాలు, పలువురు సినీ ప్రముఖులు  ఇలా సినీ కార్మికులకు గృహసదుపాయం దేశంలో ఎక్కడా లేదని అన్నారు. చిత్రపూరి కాలనీ ఇళ్ల నిర్మాణంలో గతంలో జరిగిన అక్రమాలపై తనకు అవగాహన లేదని అన్నారు. తాను దాని గురించి మాట్లాడనని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?