'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!

Published : Sep 23, 2019, 03:56 PM ISTUpdated : Sep 23, 2019, 04:04 PM IST
'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్ర విడుదల సమయం దగ్గరపడే కొద్దీ అంచనాలు ఎక్కువవుతున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ పెర్ఫామెన్స్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సైరా చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, మెగాపవర్ స్టార్ రాంచరణ్ సైరా చిత్రాన్ని నిర్మించాడు. తన తండ్రి కోసం బడ్జెట్ కు వెనకాడకుండా దాదాపు రూ 250 కోట్లు ఈ చిత్రం కోసం వెచ్చించాడు. బాహుబలిని మించేలా ఈ చిత్రంలో విఎఫెక్స్ షాట్స్ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

ఇదిలా ఉండగా సైరా చిత్రం విడుదలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. తాజాగా సైరా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు సైరా చిత్రానికి 'యుఏ' సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ సభ్యులు సైరా చిత్రానికి సింగిల్ కట్ కూడా చెప్పలేదు. చిత్ర రన్ టైం కూడా ఎక్కువగానే ఉంది. సైరా చిత్రం 2:44 గంటల నిడివితో ఉండనుంది. 

స్వాతంత్ర సమరయోధుడి కథ కాబట్టి ఆమాత్రం లెంగ్త్ ఉండడం సహజమే. దర్శకుడు సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ కథని పూర్తిస్థాయిలో చూపించబోతున్నారు. సెన్సార్ పూర్తయింది కాబట్టి ఇక విడుదల మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించింది. కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. బిగ్ బి అమితాబ్ నరసింహారెడ్డి గురువుగా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఇక తమన్నా పాత్ర కూడా సైరా చిత్రంపై ఆసక్తిని పెంచుతోంది. 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌