ఫ్యాన్స్ కి మెగాకానుక రెడీ.. 'సైరా' టీజర్ కి డేట్ ఫిక్స్!

By Udayavani DhuliFirst Published 15, Aug 2018, 3:10 PM IST
Highlights

 'ఖైదీ నెంబర్ 150' రీఎంట్రీతో ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొట్టిన మెగాస్టార్ ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో పెద్ద సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు సురేంద్ర రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ ద్వారా సినిమా టీజర్ ను ఎప్పుడు విడుదల చేయబోతున్నామనే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఆగస్టు 21న ఉదయమా 11.30 గంటల సమయంలో విడుదల్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు బహుమతిగా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. 'ఖైదీ నెంబర్ 150' రీఎంట్రీతో ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొట్టిన మెగాస్టార్ ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో పెద్ద సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుదీప్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 

 

Last Updated 9, Sep 2018, 1:37 PM IST