రీ ఫ్రెష్ అయిన మెగాస్టార్... విదేశాల నుంచి ఇంటికి చేరిన చిరంజీవి, ఇక నాన్ స్టాప్ గా..?

Published : Jun 04, 2022, 10:29 AM IST
రీ ఫ్రెష్ అయిన మెగాస్టార్... విదేశాల నుంచి ఇంటికి చేరిన చిరంజీవి, ఇక నాన్ స్టాప్ గా..?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి లాంగ్ హాలీడే ట్రిప్ తరువాత విదేశాల నుంచి హైదరాబాద్ చేరారు. ఫెయిల్యూర్ బాధతో పాటు.. షూటింగ్స్ ప్రెజర్స్ తో సమ్మర్ ట్రిప్ కి వెళ్లిన చిరు.. రీ ఫ్రెష్ అయ్యారు. 

ఆచార్య ఫెయిల్యూర్ తో బాగా డిస్సపాయింట్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. దానికి తోడు వరుస సినిమాల షూటింగ్స్ ప్రెజర్ తో బాగా ఇబ్బంది పడ్డారు. దాంతో భర్య సురేఖ తో కలిసి విదేశాలకు వెకేషన్ కు వెళ్ళారు మెగాస్టార్.  గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. నెల రోజుల హాలిడే తర్వాత శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. 

వెకేషన్‌లో ఫుల్‌గా రిలాక్స్‌ అయిన చిరంజీవి ఇక షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. ప్రస్తుతం మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్ లో  బోళా శంకర్‌,బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య, మోహన్‌రాజా డైరెక్షన్ లో  గాడ్‌ ఫాదర్‌ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్‌ చేసుకున్నారు. అయితే ఈ సినిమాల షూటింగ్స్ విషయంలో కూడా మెగాస్టార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. 

ఆచార్య ఫెయిల్యూర్ తో షాక్ తిన్నారు చిరంజీవి. ఎక్కడ పొరపాటు జరిగిందో అవి కరెక్ట్ చేసుకునే పనిలో ఉన్నారు.  ప్రస్తుతం చేస్తున్న సినిమాల దర్శకులకు కరెక్షన్స్ చెప్పి.. సినిమాలలో మార్పులు చేర్పుల బాధ్యత అప్పగించి చిరంజీవి ఫారెన్ ప్లైట్ ఎక్కారు. ఇక అన్నీ సెట్ రైట్ అనుకున్నాక వరుసగా ఫ్రెష్ గా షూటింగ్స్ స్టార్ట్ చేసుకోబోతున్నారు మెగా టీమ్. 

గాడ్‌ ఫాదర్‌ లోని ఓ సాంగ్‌ సీక్వెన్స్, బోళా శంకర్‌ షూట్, వాల్తేరు వీరయ్య ఫారిన్‌ షెడ్యూల్‌లో చిరంజీవి పాల్గొంటారట. ఇక ఈ రెండు సినిమాలే కాక.. చిరంజీవి హీరోగా ఛలో, భీష్మ సినిమాల ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈమూవీ షూటింగ్ కూడా త్వరలోనే ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్