
ఏజ్ లెక్క చేయకుండా దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 70 ఏళ్లకు రెండు అడుగుల దూరంలో ఉన్న మెగాస్టార్.. 68 ఏళ్ల వయస్సులో కూడా ఏమాత్రం అలసిపోకుండా సినిమాలు చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే.. అప్పుడు కంటే.. ఇప్పుడు ఆయనలో ఉపూ పెరిగిపోయింది. వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కుర్ర హీరోలు కూడా ఏడాదికి ఒక్క సినిమా చేయడమే కష్టం అనుకున్న ఈ రోజుల్లో.. ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సెట్స్ ఎక్కిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒక రకంగా చెప్పాలి అంటే.. లాస్ట్ ఇయర్ అంటే.. 2022 నుంచి ఈయన దూకుడు మరింత పెరిగింది.
లాస్ట్ ఇయర్ ఆచార్యతో నిరుత్సాహపడిన మెగా టీమ్.. ఆరుతావ య్చిన గాడ్ ఫారద్, సినిమాతో మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఇక. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్య అద్భుతం చేశాడు మెగాస్టార్. ఇక ప్రస్తుతం ఇప్పుడు భోళా శంకర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉండటంతో అంతా ఆ సినిమాపైదృష్టి పెట్టారు. ఆగస్టు 11న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది. మొహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అయిపోయింది. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ, వశిష్ట లాంటి యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలకు కమిటీ అయ్యాడు చిరంజీవి.
ఇక ఈమధ్య మెగాస్టార్ చిరంజీవి ఓ సెంటిమెంట్ ను బాగా ఫాలో అవుతున్నాడు. తన ప్రతీసినిమాలో ఒక యంగ్ హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు. యంగ్ స్టార్స్ తో చేస్తే.. తన వయస్సు మర్చిపోవచ్చు అనుకుంటున్నారోఏమో కాని.. మెగాస్టార్ మాత్రం తననెక్ట్స్ సినిమాలు కూడా యంగ్ స్టార్స్ ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. ఇక తాజాగా ఆయన కింగ్ నాగార్జున దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయబోతున్నాడు త్వరలో ఈసినినిమాసెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి సంక్రాంతి విడుదల చేయాలనేది చిరంజీవి ప్లాన్ చేశారట. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ తో స్క్రీన్ షేర్ చేసిన మెగాస్టార్.. వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు .
తాజాగా భోళా శంకర్ సినిమాలో అక్కినేని మేనల్లుడు సుశాంత్‌తో కలిసి నటిస్తున్నాడు చిరంజీవి. నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ సినిమాలో కూడా ఇద్దరు యంగ్ హీరోలు మెగా సినిమాల సందడి చేయబోతున్నారట. ఇందులో సిద్దు జొన్నలగడ్డ కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఆయనకు జోడీగా శ్రీ లీల నటిస్తుందని కొన్ని రోజజులుగా ప్రచారంజరుగుతోంది. అంతే కాదు ఈ సినిమాలో విలన్‌గా యంగ్ హీరో కార్తికేయనర తీసుకున్నారట మేకర్స్.. హీరోగా ఎలాగో అవకాశాలు రాడంలేదు.. విలన్ గా పెద్ద సినిమాల్లో నటిస్తూ.. తన ఇమేజ్ ను కాపాడుకోవాలి అని చూస్తేున్నాడు యంగ్ హీరో. ఇప్పటికే నానీ గ్యాంగ్ లీర్, అజిత్ తో వాలమై సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు.