చిరు, కొరటాల మూవీ.. అది రూమరేనన్న మెగాస్టార్!

Published : Sep 27, 2019, 02:38 PM ISTUpdated : Sep 27, 2019, 04:06 PM IST
చిరు, కొరటాల మూవీ.. అది రూమరేనన్న మెగాస్టార్!

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం మరో 5 రోజుల్లో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా చిరంజీవి తదుపరి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. 

సైరా హంగామా తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు మోతెక్కిస్తుండగా.. చిరంజీవి తదుపరి చిత్రానికి సంబంధించిన చర్చ మొదలైంది. అపజయం ఎరుగని కొరటాల శివ త్వరలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయన చిత్రాల్లో సందేశాత్మక అంశాలు ఉంటూనే కమర్షియల్ గా కూడా విజయం సాధిస్తుంటాయి. 

సైరా చిత్రం విడుదలయ్యాక చిరు, కొరటాల శివ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపించాయి. సైరా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న చిరంజీవి కొరటాల శివ చిత్రం గురించి క్లారిటీ ఇచ్చారు. 

కొరటాల శివ చిత్రంలో తాను డ్యూయెల్ రోల్ లో నటించనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఈ చిత్ర స్క్రిప్ట్ కి సంబంధించి ప్రస్తుతం ఫైనల్ వర్షన్ వర్క్ జరుగుతోంది. చిత్రానికి పనిచేయబోయే టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ఇక నటీనటుల ఎంపిక మాత్రమే మిగిలి ఉంది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌