KBCలో చిరంజీవి..? అమితాబ్ ను ప్రత్యేకంగా విష్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి.. కౌన్ బనేగా కరోడ్ పతి కి వెళ్ళబోతున్నారా..? ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చిరు వెల్లడించారా..? తాజాగా బిగ్ బీ గురించి ఆయన పెట్టిన పోస్ట్ లో ఏముంది..? అసలు సంగతి ఏంటి..? 
 

Megastar Chiranjeevi in Amitabh bachan KBC Show JMS

మెగాస్టార్ చిరంజీవి.. కౌన్ బనేగా కరోడ్ పతి కి వెళ్ళబోతున్నారా..? ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చిరు వెల్లడించారా..? తాజాగా బిగ్ బీ గురించి ఆయన పెట్టిన పోస్ట్ లో ఏముంది..? అసలు సంగతి ఏంటి..? 

ఇండియాకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అయితే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. ఈ ఇద్దరు స్టార్లు కలిసి కనిపిస్తే.. ఆడియన్స్ కు పండగే మరి. ఇప్పటికే ఈ ఇద్దరు మెగాస్టార్లు సైరా నరసింహారెడ్డి సినిమాలో కలిసి సందడి చేశారు. ఇక మరోసారి ఈ ఇద్దరు  ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అది పెద్ద వార్త.. అది కూడా పండగలాంటి వార్త అనే చెప్పాలి. సైరా తరువాత మరోసారి ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారని సమాచారం. అసలుఇందులో నిజం ఎంత..? 

Latest Videos

KBCలో మెగాస్టార్ చిరంజీవి.. వింటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంటే.. ఆ ఎపిసోడ్ ఎంత గొప్పగా ఉండాలి.. అవును ఈ విషయం చెప్పకనే చెప్పారు మెగాస్టార్. డైరెక్ట్ గా చెప్పకుండా చిన్న హింట్ ఇచ్చాడు. ఈరోజు  అమితాబ్ పుట్టినరోజు కావడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి కూడా అమితాబ్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. అయితే ఈ శుభాకాంక్షలుతో పాటు మరో న్యూస్ ని కూడా చెప్పాడు చిరు.

 

A Very HAPPY 81st BIRTHDAY 🙏
Guru Ji ! 💐💐

May you be blessed with a long life, filled with happiness & good health!
May you keep enthralling & inspiring millions of us for many many years to come, with your acting genius!! 🙏🙏

This Birthday of yours is also… pic.twitter.com/bLQY3OjwkU

— Chiranjeevi Konidela (@KChiruTweets)

అమితాబ్ బచ్చన్ హిందీలో కౌన్ బనేగా క్రోర్‌పతి (KBC) షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షోలో చిరంజీవి పాల్గొనబోతున్నాడట. చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నేను నా ఇన్‌స్పిరేషన్ అయిన అమితాబ్ ని KBC షోలో ఈ రోజు నైట్ వర్చ్యువల్ గా కలుసుకోబోతున్నాను అంటూ తెలియజేశారు. దాంతో మెగా ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అమితాబ్ తో చిరు ఎపిసోడో ఎలా ఉంటుందా అంటూ అంతా వెయిట్ చేస్తున్నారు. 

కాగా చిరంజీవి కూడా ఈ ప్రోగ్రామ్  తెలుగు వెర్షన్ ను హోస్ట్ చేశారు. బాలీవుడ్ లో కౌన్ బనేగా కరోడ్ పతి అయితే.. తెలుగులో మాత్రం మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో కింగ్ నాగార్జున ఈ షో స్టార్ట్ చేశారు. ఇక ఈషోని మెగాస్టార్ చిరంజీవి కూడా సక్సెస్ ఫుల్ గా హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ షోకి కూడా తెలుగులో మంచి ఆదరణ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హోస్ట్ లు కలిసి ఈ షోలో కనిపించబోతున్నారు అని తెలియడంతో.. ఈ షోలో ఈ ఇద్దరు కలిసి ఏం మాట్లాడుకోబోతున్నారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

vuukle one pixel image
click me!