ప్రాణాపాయంలో అభిమాని.. పరుగు పరుగున వచ్చిన మెగాస్టార్ చిరంజీవి

By Mahesh JujjuriFirst Published Aug 17, 2022, 10:20 AM IST
Highlights

అభిమానులకు ఎప్పుడూ.. అండగా ఉంటూ వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాన్స్ కు ఏమైనా అయ్యిందంటే పరుగుపరుగున వచ్చి సహాయం చేస్తుంటారు. రీసెంట్ గా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు చిరు. 

ఇండస్ట్రీకి కాని.. తన అభిమానుల్లో ఎవరికైనా కాని..  ఏ ఆపద వచ్చిన సాహాయం చేయడానికి ముందుంటాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇక తన అభిమానులకు ఏదైనా ఆపద ఎదురైతే.. తోడబుట్టిన అన్నయ్యలా ఎప్పుడూ అండగా నిలుస్తున్నారు. ఫ్యాన్స్ కి  నేనున్నాను అంటూ భరోసా ఇస్తాడు. ఇలా గతంలో ఎంతో మంది ఆపదలో ఉన్నవారికి సాయం అందించిన మెగాస్టార్ ఇండస్ట్రీ పెద్దగా.. కరోనాతో విలవిల్లాడుతున్న సినీ కార్మికులను కూడా ప్రతేకంగా ఏర్పాటు చేసిన రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకున్నారు. 

అంతే కాదు తమ చివరికోరికగా అభిమాన నటుడిని చూడాలి అని ఆరాటపడుతున్న వారికి చివరికోరిక తీర్చి.. ఆనందం అందించారు. తనకోసం ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ వచ్చే అభిమానులకు ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ.. వారిని ఆదరించారు. ఇక తాజాగా చిరంజీవి.. అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానికి తోడుగా నిలిచాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన వీరాభిమానికి సాయమందించారు. 

 

 కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని దొండపాటి చక్రధర్‌కు క్యాన్సర్‌ సోకింది. గత కొన్నాళ్ల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం అభిమాన సంఘాల ద్వారా తెలుసుకున్నారు  చిరంజీవి.  వెంటనే తన అభిమానికి  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్  తరలించారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేయించారు. అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి సోమవారం సాయంత్రం  వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు చిరంజీవి.

అంతే కాదు అక్కడే చాలా సేపు ఉన్న చిరు..  అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకున్నారు.  మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆయన కోరారు. అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని.. భయపడవలసిన అవసరం లేదని.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు మెగాస్టార్ అభయం ఇచ్చారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చక్రధర్ తో ప్రేమగా మాట్లాడి ధైర్యం చెప్పారు. చిరు చేసిన ఈ పనికి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే.. దేవుడు మా మెగాస్టార్ అంటూ.. సందడి చేస్తున్నారు. 


 

click me!