మెగా ఫ్యాన్స్ కు పండగే.. వాల్తేరు వీరయ్య నుంచి బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

Published : Nov 29, 2022, 08:13 PM ISTUpdated : Nov 29, 2022, 08:14 PM IST
మెగా ఫ్యాన్స్ కు పండగే.. వాల్తేరు వీరయ్య  నుంచి బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్

సారాంశం

అభిమానులకు వరుస ట్రీట్ లు ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఫ్యాన్స్ లో  జోష్ పెంచేలా ట్రీట్ లు ఇస్తూ వెళ్తున్నాడు. రీసెంట్ గా వాల్తేర్ వీరయ్య నుంచి బాస్ సాంగ్ రిలీజ్ చేశారు.. ఇక ప్రస్తుతం మరో వీడియోతో వైరల్ అవుతున్నారు.      

వరుస సినిమాలతో మెగా అభిమానులకు మెగా ట్రీట్ ఇస్తున్నాడు చిరంజీవి. కుర్ర హీరోలను మించిపోయేలా ఫాస్ట్ గాసినిమాలు చేస్తున్నాడు మెగాస్టార్. ఆచార్య నిరాశపరిచినా.. గాడ్ ఫాదర్ తో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న చిరు.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య.. చేస్తుననాడు మెగాస్టార్. ఈ మూవీతో చిరంజీవి మెగా  ఎంటర్‌ టైన్‌మెంట్  అందించేందుకు రెడీ అవుతున్నుడు. 

మాస్‌ ఎంటర్‌ టైనర్‌ గా వస్తున్న ఈ మూవీ నుంచి రీసెంట్‌గా బాస్‌ పార్టీ సాంగ్ విడుదలవగా.. మిలియన్ల కొద్ది వ్యూస్ తో ఈ సాంగ్ దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్.. ఆయనే స్వయంగా రాసిన లిరిక్స్.. నకాశ్‌ అజీజ్‌, డీఎస్పీ, హరిప్రియ గాత్రం మెగా అభిమానులను  ఉర్రూతలూగించింది. 

 

ఇక రీసెంట్ గా  బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  మైత్రీమేకర్స్ అఫీషయల్ సోషల్ మీడియా పేజ్ లో ఈ సాంగ్ మేకింగ్ రిలీజ్ అయ్యింది.  పాట చిత్రీకరణ కు సబంధించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.  శేఖర్ మాస్టర్  కొరియోగ్రఫీ  చేసిన ఈ పాటను.  బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా - చిరంజీవి కాంబోలో వస్తున్న ఈ పాట మాస్‌ లవర్స్ కు కావాల్సిన ఎంటర్‌ టైన్‌ మెంట్ అందించడం ఖాయమని సాంగ్‌ తో తెలుస్తోంది.

ఇక బాబీ దర్శకత్వం వహిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈమూవీని సంక్రాంతి కానుకుగా.. 2023 జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్
Krishna కథ వినకుండా మహేష్ బాబు చేసిన డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?