
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై.. ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. నటుడు, పొలిటీషియన్ 30 ఇయర్స్ ఫృథ్వీ.
పవన్ కళ్యాణ్ హీరోగా.. సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఈమూవీ ఈనెల 25న రిలీజ్ అయ్యి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్లే లక్ష్యంగా పరుగులు తీస్తుంది భ్లీమా నాయక్ మూవీ. ఇక ఈమూవీ విజయంపై అటు మూవీ టీమ్ తో పాటు.. ఫ్యాన్స్ దిల్ ఖుషీగా ఉన్నారు. మరో వైపు ఈ సినిమా గురించి పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు.
రీసెంట్ గా ఈ సినిమా సక్సెస్ గురించి స్పందించారు ప్రముఖ నటుడు, వైసీపి నాయకుడు 30 ఇయర్స్ ఫృధ్వీ. రీసెంట్ గా భీమ్లా నాయక్ సినిమా చూశానని చెప్పిన పృథ్వీ..ఓ ఇంటర్వ్యూలో..ఈ సినిమా గురించిన విషయాలు పంచుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ శుభాకాంక్షలు అన్నారు. రీసెంట్ గా భీమ్లా నాయక్ సినిమా చూశాను. నా జీవితంలో గుర్తుడిపోయే సినిమా ఇది. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఒకటే బాధ. ఈ సినిమాలో నేను ఎందుకు నటించలేదా అని బాధపడ్డాను. అని చెప్పుకొచ్చారు పృథ్విరాజ్.
అంతే కాదు అడవి రాముడు సినిమా టైమ్ లో తాడేపల్లిగూడేంలో విజయా టాకీస్ లో ఆ సినిమా చూశానని.. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన ఆడియ్స్ ను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీ చార్జ్ చేశారని.. ఆతరువాత అంత ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చూస్తున్నానంటూ.. పొగడ్తలతో ముంచెత్తాడు పృథ్వీరాజ్. అంతే కాదు ఒక ప్రేక్షకుడిలా భీమ్లా నాయక్ సినిమాను చూసినట్టు చెప్పారు కమెడియన్. పవర్ స్టార్ ను చూస్తున్నంతసేపు ఆయనకు ఎక్కడ దిష్టి తగులుతుందేమో అనిపించిందన్నారు.
ఇండస్ట్రీలో ప్రస్తుతం పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. పృథ్విరాజ్ సినీనటుడే కాదు వైసీపి లీడర్ కూడా. పవర్ స్టార్ కు.. వైసీపీకి ప్రస్తతం ఉప్పు,నిప్పులా ఉంది. ఇండస్ట్రీలో ఉన్న వైసీపీ నాయలకులు కూడా పవన్ ను గట్టిగా విమర్షిస్తున్న టైమ్ లో ఒక వైసీపీ లీడర్ గా ఉన్న పృథ్వీరాజ్ పవన్ పై పాజిటీవ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.