Chiranjeevi : బెంగాల్ బాషలో చిరంజీవి ట్వీట్.. స్టార్ హీరోకు మెగాస్టార్ విషెష్..

Published : Jan 24, 2022, 08:30 AM IST
Chiranjeevi : బెంగాల్ బాషలో చిరంజీవి ట్వీట్.. స్టార్ హీరోకు మెగాస్టార్ విషెష్..

సారాంశం

కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవికి(Megastar Chiranjeevi) మంచి టైమ్ దొరికింది. షూటింగ్స్ కు బ్రేక్ రావడంతో చిన్న సినిమాలు కూడా ఇంట్లోంచి చూస్తన్నారు మెగాస్టార్. వాటిపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వెల్లడిస్తున్నారు. ఇక ఈమధ్య ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టారు చిరంజీవి.  

టైమ్ దొరకడంతో చిన్న సినిమాతో పాటు ఇతర భాషల సినిమాలు.. ఇతర భాషల హీరోల గురించి తన అభిప్రాయు తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). చాలా మందిని ఇలాగే ప్రోత్సహిస్తూ.. చిన్న సినిమాల అప్ డేట్స్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు మెగాస్టార్.  అందులో బాగంగానే చిరు బెంగాలీ బాషలో ఓ ట్వీట్ చేశారు. అది కూడా మన తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు చేసే బెంగాలీ యంగ్ హీరో కోసం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆ హీరోకు బెస్ట్ విషెష్ కూడా చెప్పారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో అశ్వథ్ధామ, భీష్మ, శ్యామ్ సింగరాయ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించిన హ్యాండ్సమ్ విలన్ జీషుసేన్ గుప్త(jishu Sengupta). ఈయన ఇక్కడ విలన్ గా పరిచయం అయినా.. బెంగాల్ లో మాత్రం జీషు స్టార్ హీరో. ఆయనకు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ హీరోగా నటిస్తూనే.. అవకాశాలు రావడంతో టాలీవుడ్ లో స్టైలీష్ విలన్ గా అవతారం ఎత్తాడు బెంగాలీ స్టార్.

ఇక ఈ బెంగాల్ హీరో.. బెంగాలీలో నటిచిన సినిమా బాబా బేబీ ఓ. ఈమూవీని పిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం రిలీజ్ అయ్యింది. అరిత్ర ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో సోలంకీ రాయ్ హీరోయిన్ గా నటిస్తోంది. 40 ఏళ్ల మేఘ్ అనే పాత్ర సరోగసి ద్వారా పుట్టిన పిల్లల్ని పెంచుకోవాలి అనుకుంటాడు.. ఈ క్రమంలో అతనికి వృష్టి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. దాంతో తన జీవితం చాలా మలుపులు తిరుగుతుంది. మరి చివరికి ఏమైంది..? తను అనుకున్నది చేయగలిగాడా లేదా అనేది కథ. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ బెంగాలీ హీరో jishu Sengupta సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ట్విట్టర్ లో షేర్ చేశారు. ట్రైలర్ లింక్ తో పాటు.. హీరో జీషూ(jishu Sengupta )ను విషెష్ కూడ చెప్పారు చిరంజీవి.  ఫన్ అండ్ ఎమోషనల్ బెంగాలీ మూవీ బాబా బేబీ ట్రైలర్ ను షేర్ చేస్తున్నాను. ఈసినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా స్నేహితుడు జీషు సేన్ గుప్తాకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. అయితే మెగాస్టార్ బెంగాల్ భాషలో కూడా ట్వీట్ చేయడం విశేషం.

 

బెంగాలీతో పాటు టాలీవుడ్ సినిమాలపై జీషు సేన్(jishu Sengupta) గుప్త దృష్టి పెట్టాడు. తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. టాలీవుడ్ లో చాలా ఆఫర్స్ కొట్టేస్తున్నాడు. ప్రస్తుతం జీషు సేన్ గుప్త మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మోహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో  విలన్ గా నటిస్తున్నారు. దాంతో మెగాస్టార్ చిరంజీవి ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు