మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వస్తుంది. ఆచార్య రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నఫ్యాన్స్ కోసం రెడీ అవుతున్నారు మెగా తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్ చరణ్. భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.
మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వస్తుంది. ఆచార్య రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నఫ్యాన్స్ కోసం రెడీ అవుతున్నారు మెగా తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్ చరణ్. భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.
చిరంజీవి,రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య. నిరంజన్ రెడ్డి నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా కాజల్ ..చరణ్ జోడీగా పూజ హెగ్డే నటించారు. ఈ నెల 29వ తేదీన ఆచార్య గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నాడ. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని తాజా సమాచారం. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనే భారీస్థాయిలో రిలీజ్ చేయడానికి పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 1500 నుంచి 2000 స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అటు మెగా పవర్ స్టార్ ట్రిపుల్ ఆర్ తో తన ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది. అందులోనూ సైరా తరువాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా కావడం.. చిరంజీవి తో పాటు చరణ్ బాబు కూడా ప్రధానమైన పాత్రలు చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
సోనూసూద్ ,సంగీత, అనసూయ లాంటి స్టార్స్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో రెజీనా ఐటమ్ సాంగ్ స్పెషల్ కాబోతోంది. చాలా కాలంతరువాత మెలొడీ బ్రహ్మ మణిశర్మ మెగాస్టార్ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.