జ‌న‌వరి 10న ఓం నమో వేంకటేశాయ ఆడియో రిలీజ్

Published : Dec 25, 2016, 01:54 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
జ‌న‌వరి 10న ఓం నమో వేంకటేశాయ ఆడియో రిలీజ్

సారాంశం

పిబ్ర‌వ‌రి 10న రిలీజ్ కానున్న ఓం నమో వేంకటేశాయ సినిమా  జ‌న‌వరి 10న ఓం నమో వేంకటేశాయ ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మం ‘ఓం నమో వేంకటేశాయ  ఆడియో వేడుక తేదిని ట్వీట్ చేసిన నాగార్జున‌

 

 సినిమా‘ఓం నమో వేంకటేశాయ ఆడియో వేడుక తేదిని ట్విట్టర్లో నాగార్జున ప్రకటించాడు. ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ.. ‘ఓం నమో వేంకటేశాయ’ ఆడియో వేడుకను జనవరి 10న నిర్వహించనున్నట్లు ప్రకటించాడు. నిన్నే విడుదలైన ‘ఓం నమో..’ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. అన్నమయ్య.. శ్రీరామదాసు.. తరహాలోనే ప్రేక్షకుల మనసులు గెలిచేలా కనిపించింది.

 రెండు సినిమాల ఆడియోలు ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలకు కీరవాణి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక చిత్రాలంటే కీరవాణి ఎంతో మనసుపెట్టి పాటలు చేస్తాడు. గత కొన్నేళ్లలో ‘బాహుబలి’ మినహా ఆయన్నుంచి చెప్పుకోదగ్గ ఆడియోలు రాలేదు.

 ‘ఓం నమో వేంకటేశాయ’తో కీరవాణి మళ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటాడని భావిస్తున్నారు. ఈ సినిమాలో పదికి పైగా పాటలుంటాయట. ఆడియో అద్భుతంగా వచ్చిందని టాక్. ఎస్పీ బాలు సహా చాలామంది సీనియర్ గాయకులతో పాటలు పాడించాడట కీరవాణి. మరి ఈసారి కీరవాణి నుంచి ఎలాంటి ఆడియో వస్తుందో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

పవన్ కళ్యాణ్ తో పోటీ పడి చావు దెబ్బ తిన్న మహేష్ బాబు సినిమా ఏదో తెలుసా?
Illu Illalu Pillalu Today Episode Jan 2: అమూల్యకు పెళ్లిచూపులు, ఈలోపే విశ్వక్ అదిరిపోయే ప్లాన్