చిరును ఆదరించిన వాళ్ల కోసం అది తప్పక చేయాల్సిందే

Published : Jan 19, 2017, 10:19 AM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
చిరును ఆదరించిన వాళ్ల కోసం అది తప్పక చేయాల్సిందే

సారాంశం

ఖైదీ కలెక్షన్లు మైండ్ బ్లోయింగ్ అంటున్న మెగా పవర్ ప్రొడ్యూసర్ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రానికి హౌజ్ ఫుల్ కలెక్షన్లు ఆదరించిన వారికి థాంక్స్ చెప్పేందుకు కృతజ్ఞతాభినందన సభ నిర్వహణ ఏర్పాట్లు

మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 విజయోత్సాహంతో దూసుకెళ్తోంది. దీంతో... ఆదరించిన అబిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాలని పిక్స్ అయ్యారు మెగా టీమ్. అభిమానుల కోసం కృతజ్ఞతాభినందన సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే పలువురు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలకు, ముఖ్యులకు ఆహ్వానాలు కూడా పంపినట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఖైదీ నంబర్ 150. మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ, రిలీజ్ తరువాత సరికొత్త రికార్డ్లను సృష్టిస్తూ దూసుకుపోతోంది. యంగ్ హీరోలను సవాల్ చేస్తూ చిరంజీవి వందకోట్ల క్లబ్లో అడుగుపెట్టడంతో తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు ఖైదీ నంబర్ 150 టీం. ఈ ఆనందాన్ని ఇంకా మెమరబుల్ గా ఉంచుకోవడానికి మెగా స్టార్ ఫ్యాన్స్ కోసం మరో సరికొత్త థాంక్స్ గివింగ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

అందుకే భారీ విజయోత్సవ వేడుకను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకను హైదరాబాద్ లేదా.. విశాఖలలో నిర్వహించాలని భావిస్తున్నారు. గతంలో మెగా హీరోల సక్సెస్మీట్లను విశాఖలో నిర్వహించిన నేపథ్యంలో ఖైదీ విషయంలో కూడా అదే సెంటిమెంట్ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.  ఇప్పటికే ఖైదీ నంబర్ 150 ఉత్తరాంద్రలో 8 కోట్లకు పైగా వసూళ్లు సాధించటంతో అక్కడే విజయోత్సవాన్ని నిర్వహిస్తే 10 కోట్ల మార్క్ చేరుకోవచ్చని కూడా భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: సూపర్ ట్విస్ట్-దొరికిపోయిన వైరా- తప్పు ఒప్పుకున్న కాశీ-జ్యో అరెస్ట్
Anasuya: `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్‌ ఎవరో తెలుసా? సినిమా చూసి ఆమె రియాక్షన్‌ ఇదే