నేనూ బాధితుడినే : హడావుడిగా సినిమాలు తీయొద్దు, దర్శకులకు చిరు చురకలు.. ‘కొరటాల’ గురించేనా

By Siva KodatiFirst Published Aug 31, 2022, 9:37 PM IST
Highlights

దర్శకులకు సూచనలు , సలహాలు ఇస్తూనే చురకలు వేశారు మెగాస్టార్ చిరంజీవి. సినిమాను గట్టెక్కించడంలో దర్శకులదే ప్రధాన భూమిక అన్న ఆయన.. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఆడదని తాను కూడా బాధితుణ్ణే అని చిరంజీవి పేర్కొన్నారు. 

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటోన్న సమస్యలు, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్న వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. బుధవారం ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. కంటెంట్ వుంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు. దర్శకులు కథపై బాగా కసరత్తు చేయాలని ... భారీ తారాగణం, హిట్ కాంబినేషన్స్, కాల్షీట్స్ దొరికాయాని హాడావుడిగా సినిమాలు తీయొద్దని చిరంజీవి కోరారు. సినిమాను గట్టెక్కించడంలో దర్శకులదే ప్రధాన భూమిక అని చిరు చెప్పారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా ఆడదని.. తాను కూడా బాధితుణ్ణే అని చిరంజీవి అన్నారు. దర్శకులపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి వుంటాయని.. సరిగా సినిమా తీయలేకపోతే చాలా మంది జీవితాలు తలక్రిందులవుతాయని చిరు హెచ్చరించారు. 

అయితే మెగాస్టార్ ఈ వ్యాఖ్యలు చేసింది దర్శకుడు కొరటాల శివను ఉద్దేశించే అంటూ ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చివరి చిత్రం ఆచార్య ఎన్నో అంచనాల మధ్య రిలీజై ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్దా చిత్ర ప్రమోషన్ సమయంలోనూ చిరంజీవి ‘ఆచార్య’ గురించి వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ చేసే పాత్రలు తాను చేయడానికి సాహసించను అని చిరంజీవి అన్నారు. అలాంటి పాత్రలు అమీర్ ఖాన్ కి మాత్రమే సాధ్యం అని అన్నారు. నా వరకు వస్తే నేను చేసే సినిమాలు జన రంజకంగా ఉండాలి. 

Also REad:ఆచార్య వైఫల్యం మొత్తం కొరటాల మీదకు నెట్టేస్తావా... చిరుపై ఓ వర్గం ఫైర్!

అమీర్ ఖాన్ ప్రయోగాలు, సాహసాలు చేసి ప్రేక్షకులని మెప్పించి ఒప్పించగలరు అని అన్నారు. కానీ నేను మాత్రం ప్రేక్షకులు వినోదాన్ని కోరుకునే సినిమాలు మాత్రమే చేస్తాను అని అన్నారు. కానీ కొన్ని కొన్ని సార్లు నా ప్రమేయం లేకుండా, నా చేతుల్లో లేకుండా పోతుంది., వాటి గురించి మాట్లాడను అని నవ్వుతూ అన్నారు. ఆచార్య పరాజయం గురించే చిరంజీవి ఈ కామెంట్స్ పరోక్షంగా చేశారని వార్తలు వచ్చాయి. అలాగే అమీర్ ఖాన్ చేస్తున్న సినిమాలు, బాలీవుడ్ లో వస్తున్న విభిన్న పాత్రలు, ఆ రకమైన వర్క్ షాప్స్ చేసి.. టైం తీసుకుని టాలీవుడ్ హీరోలు చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా చిరంజీవి స్పందించారు. అలాగే చేయాలి అని చిరంజీవి అన్నారు. దర్శకుడు కథని టెక్నీషియన్స్, నటీనటులకు అందరికి అర్థం అయ్యేలా వివరించాలన్నారు. 

click me!