రెండ్రోజుల్లో నాలుగు మిలియన్ వ్యూస్ తో కుమ్మేసిన అమ్మడు సాంగ్

Published : Dec 22, 2016, 08:38 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
రెండ్రోజుల్లో నాలుగు మిలియన్ వ్యూస్ తో కుమ్మేసిన అమ్మడు సాంగ్

సారాంశం

కుమ్మేస్తున్న మెగాస్టార్ అమ్మడు సాంగ్ రెండ్రోజుల్లో నాలుగు మిలియన్ యూట్యూబ్ క్లిక్స్ థియేటర్స్ లో ఇరగదీస్తుందంటున్న మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ ఖైదీ నెం 150 చిత్రంలోని అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు అంటూ సాగే పాట‌ యుట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది.  దిస్ ఈజ్ నాట్ మాస్ సాంగ్...దిస్ ఈజ్ బాస్ సాంగ్ అంటూ దేవిశ్రీ వాయిస్ తో స్టార్ట్ అయిన ఈ సాంగ్ మేకింగ్ ను ఈరోజు రిలీజ్ చేసారు. చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ పై చిత్రీక‌రించిన ఈ పాట‌ను డ్యాన్స్ మాస్ట‌ర్ శేఖ‌ర్ నృత్య ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌రించారు.

 

ఈ సాంగ్ ను చిత్రీక‌రిస్తుంటే...సెట్ లో ఉన్న జెమిని కిర‌ణ్ తో పాటు అక్క‌డ ఉన్న యూనిట్ మెంబ‌ర్స్ అంద‌రూ ఆ సాంగ్ కు కాలు క‌ద‌ప‌కుండా ఉండ‌లేక‌పోయారు. కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ అయితే...చిరంజీవి గారి స్టెప్స్, స్టైల్ చూస్తుంటే ఈ జీవితానికి ఇక చాలు అనిపించింది అంటూ సంతోషం వ్య‌క్తం చేసారు. ఇక దేవిశ్రీప్ర‌సాద్ అయితే....ఈ అమ్మ‌డు సాంగ్ కుమ్మేస్తుంది నో డౌట్ అంటున్నారు. ఈ సాంగ్ ను జి.ఎఫ్.ఎం డాలీ అనే కొత్త కెమెరాతో సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు చిత్రీక‌రించారు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఖైదీ నెం 150 చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.దేవిశ్రీ చెప్పిన‌ట్టుగా ఈ అమ్మ‌డు సాంగ్ కుమ్మేయ‌డం ఖాయం..!

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌