బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ లో వరుణ్ తేజ్...? గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. లేదా..?

Published : May 21, 2023, 01:17 PM IST
బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ లో వరుణ్ తేజ్...? గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. లేదా..?

సారాంశం

ఆమధ్య టాలీవుడ్ లో రీమేక్ సినిమాలు ఎక్కువైపోయాయి.. మరీ ముఖ్యంగా మెగా హీరోలంతా రీమేక్ సినిమాలవైపు పరుగులు తీస్తున్నారు. మెగాస్టార్.. పవర్ స్టార్ తో పాటు.. ప్రస్తుతం మెగా ప్రిన్స్ కూడా రీమేక్ సినిమాలవైపే చూస్తున్నాడు. 

అప్ అండ్ డౌన్ అన్నట్టుగా సాగుతోంది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ కెరీర్. ప్లాప్ సినిమాతో స్టార్ట్ అయ్యి.. మధ్యలో వరుస హిట్లు, యావరేజ్ మూవీస్ చేసుకుంటూ.. వెళ్తున్న వరుణ్ తేజ్.. రీసెంట్ గా గని సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేశాడు. ఈ సినిమాకోసం వరుణ్ ఏడాదికి పైగా చేసిన కృషి ఏమాత్రం వర్కౌట్ అవ్వలేదు.  ఫస్ట్ రోజే ఈమూవీ బోల్తా కొట్టింది. ఇక ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో గాఢీవధారి అర్జున సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈమూవీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు మెగా హీరో. 

ఇక ఇదిలా ఉంటే  తేజ్ కు ఓ బాలీవుడ్‌ రీమేక్‌ ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తుంది.అది కూడా అక్కడ సూపర్ హిట్ అయిన సినిమా..?  లాస్ట్ ఇయర్ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాలు సృష్టించిన భూల్‌ భూలయ్య-2 ను తెలుగులో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నాదట ఓ స్టార్ ప్రొడ్యూసర్.  అంతే కాదు ఈసినిమాలో హీరోగా వరుణ్ తేజ్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. అయితే ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటి వరకూ కన్ ఫార్మ్ అవ్వలేదు. 

వరుణ్‌తో మేకర్స్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ సినిమానే కావచ్చు కానీ ఇక్కడ ఇది వర్కువుట్‌ అవుతుందా అనేది ఆలోచించుకుని చేయాలని వరుణ్ భావిస్తున్నాడ. అసలే వరుస దెబ్బలు తగిలి ఉన్నాయి. మళ్లీ రిస్క్ అవసరమా అని కూడా చూస్తున్నాడట. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాదూన్ లాంటి సినిమాలు నితిన్ తెలుగులో చేస్తే డిజాస్టర్ అయ్యింది. మరి ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందా అని ఆలోచిస్తున్నారు.  అందులోను ఈసినిమాను చాలా మంది ఓటీటీలో చూసేశారు కూడా. 

తెలుగులో చేయడానికి అంతపెద్ద గొప్ప కథ కాదు.  స్క్రీన్‌ ప్లే కూడా పెద్దగా బాగోదు. అంటే.. స్క్రీన్ ప్లే లో పట్టులేదు. కామెడీ బాగా పండినా.. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా కథ సెట్ అవ్వలేదు. అందులోను ఈ కథలో.. మెయిన్ లీడ్ అంతా టాబుదే..  అంత గ్రిప్పింగ్‌గా లేదు. అయితే ఈ సినిమాలో కామెడీ బాగా పడింది. అదే సినిమాను సక్సెస్‌ బాటలో నడిపింది. నిజానికి ఈ సినిమాలో ప్రధాన పాత్ర అంటే టబుదే. హీరో పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదనే అభిప్రాయం ఉంది. దాంతో ఈసినిమా కథను దర్శకుడు మార్చి.. మన నెటివిటీకి తగ్గట్టు మారిస్తే తప్పించి చేయడానికి ఆస్కారం ఉండదు. గతంలో గడ్డల కొండ గణేష్ కూడా అలానే చేశారు హిట్ అయ్యింది. మరి ఈ సినిమాను కూడా అలానే మారుస్తారో లేదో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్