గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) తన అభిమానుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తారో తెలిసిందే. నిన్న తారక్ పుట్టిన రోజును ఫ్యాన్స్ సెలబ్రేట్ చేయడం పట్ల ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా థ్యాంక్యూ నోట్ విడుదల చేశారు.
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, నందమూరి తారకరామారావు మనవడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నందమూరి హీరోగా అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కేరీర్ లో ఎన్నో అటుపోట్లను చూస్తు వస్తారు. అదే సమయంలో కోట్లాది మంది అభిమానులనూ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ పై ఉన్న ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమా ఫంక్షన్ లో అభిమానుల క్షేమం గురించి, వారి కుటుంబాల గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు.
మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు కూడా తారక్ పై ఎనలేని ప్రేమను కురిపిస్తుంటారు. ప్రతి విషయంలో మద్దతుగా నిలుస్తుంటారు. ఇక సినిమా విడుదల సమయంలో వారి హంగామా గురించి చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా ‘ఆర్ఆర్ఆర్’తో తారక్ వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇండియాలోనే కాకుండా జపాన్, యూఎస్ వంటి దేశాల్లోనూ ఎన్టీఆర్ కు వీరాభిమానులు ఉన్నారు. అయితే నిన్న ఎన్టీఆర్ 40వ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. స్టార్ హీరోలు Hrithik Roshan, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఇతర సినీ తారలు, ఫ్యాన్స్, శ్రేయోభిలాషుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలే కనిపించాయి.
ఫ్యాన్స్ చూపించిన ప్రేమకు ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా థ్యాంక్యూ నోట్ ను విడుదల చేశారు. ‘కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నా అభిమానులే నన్ను నడిపిస్తున్నారు. బలమైన మద్దతు ఇస్తున్నారు. నేను నటించే పాత్ర, ప్రతి కథ కూడా అభిమానుల కోసమే. అంతలా నాపై ప్రేమ చూపించే ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ‘దేవర’ టైటిల్ పై మీ స్పందనకు చాలా గర్వపడుతున్నాను. అలాగే నా పుట్టినరోజున మరింత ప్రత్యేకంగా మార్చిన నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులకు ధన్యవాదాలు‘. అంటూ నోట్ లో పేర్కొన్నారు.
ఎన్టీఆర్ బర్త్ డే రోజేనే హైదరాబాద్ లో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించిన విషయం తెలిసిందే. బాలయ్య, రామ్ చరణ్, యంగ్ స్టార్స్, సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీల పెద్దలు కూడా హాజరయ్యారు. మరోవైపు సింహాద్రి రీరిలీజ్ కూడా థియేటర్లలో దుమ్ములేపింది. ఫ్యాన్స్ గోలకు దద్దరిల్లిపోయింది. మొదటి రోజు 5 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే NTR30 నుంచి కూడా విడుదలైన పోస్టర్ కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. NTR31 షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభించనున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నుంచి తారక్ కు స్పెషల్ విషెస్ అందడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో War2 రాబోతోంది.
Grateful ❤️ pic.twitter.com/LOKvb00tBj
— Jr NTR (@tarak9999)