
వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘గని’. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్టు సమచారం. కాగా ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. గని టైటిల్ అంథిమ్, మిల్కీ బ్యూటీ థమన్న నటించిన స్పెషల్ సాంగ్ ‘కొడితే’, క్రియేటివ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ పాడిన ‘రోమియో జూలియట్’ సాంగ్స్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ చిత్రానికి సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ మ్యూజిక్ అందించాడు. టాలీవుడ్ లో పెద్ద సినిమాలకు సంగీతం అందించే దర్శకులలో కచ్చితంగా తమన్ పేరు ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, థమన్ హవా కొనసాగుతోంది. కొత్త సినిమా వస్తుందంటే వీరిలో ఎవరో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటున్నారు. వీరి సంగతం కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతో మెప్పిస్తోంది. వీరి మధ్య నువ్వా? నేనా? అన్నట్టు ఎప్పుడూ పోటీ నెలకొంటూనే ఉంది.
అయితే, ‘గని’ మూవీ నుంచి ‘రోమియో జూలియట్’ పాటను నిన్న విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ స్టేజ్ పై మాట్లాడారు. సినిమా గురించి పలు విషయాలను ఆడియెన్స్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా థమన్ గురించి మాట్లాడుతూ ‘ద రాక్ స్టార్ థమన్... మ్యూజిక్ బాగా కొట్టేవారెవరైనా రాక్ స్టారే...’ అంటూ వ్యాఖ్యానించాడు. ఇందుకు థమన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ‘హేయ్.. నేను కాదు రాక్ స్టార్’ అంటూ వరుణ్ తేజ్ కు బదులిచ్చాడు. ఆ తర్వాత ‘థమన్ కొంచెం టెన్షన్ పెడ్తాడు.. కానీ మ్యూజిక్ బాగా కొడ్తాడు’ అంటూ వరుణ్ తేజ్ తన స్పీచ్ ను కొనసాగించాడు. తన మ్యూజిక్ ఫంక్షన్ లో ‘దేవీశ్రీ ప్రసాద్’ పేరును వినడంతో థమన్ కొంత డిసాపాయింట్ అయినట్టు తెలుస్తోంది.
కాగా, ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ‘థమన్ రాక్ స్టార్ ఏంటీ.. వరుణ్ బాబు.. టాలీవుడ్ కి రాక్ స్టార్ ఒక్కడే దేవీ శ్రీప్రసాద్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు అటు బాలీవుడ్ లోనూ దేవీ తన మార్క్ ను చూపెడుతూ, కొత్త స్టంట్లతో దూసుకెళ్తున్నాడు. ఫలితంగా అక్కడ కూడా థమన్ ను దేవీ శ్రీ ప్రసాద్ వెనక్కి నెడుతున్నారంటూ పలువురు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఏదేమైనా థమన్ వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ తన సత్తా చాటుకుంటున్నారు.