Amitabh Bachchan: `ఝుండ్` టీజర్ చూసారా? అదుర్స్..అమితాబ్ అయితే కేక

Surya Prakash   | Asianet News
Published : Feb 09, 2022, 12:08 PM IST
Amitabh Bachchan: `ఝుండ్`  టీజర్ చూసారా? అదుర్స్..అమితాబ్ అయితే కేక

సారాంశం

ఫుట్‌బాల్‌ ఆటగాడు విజయ్‌ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ ఫుట్‌బాల్‌ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారిన వీధి బాలలను మామూలు మనుషులుగా మార్చి వారితోనే ఫుట్‌బాల్‌ జట్టు తయారు చేస్తారు అమితాబ్‌.


ఒక్క టీజర్ వదిలి ఓపినింగ్స్ పట్టేస్తున్నారు దర్శక,నిర్మాతలు. తమ సినిమాలో కంటెంట్ ని హైలెట్ చేస్తూ వదిలే టీజర్,ట్రైలర్స్ కు ఓ రేంజిలో ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియా వచ్చాక బాగున్న టీజర్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలా తాజాగా వైరల్ అవుతున్న టీజర్ అమితాబ్ నటించిన  `ఝుండ్`  . `ఝండ్` టీజర్ ఇలా విడుదలైందో లేదో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యి దూసుకుపోతోంది. అంతగా జనాల్లోకి వెళ్లేటంత కంటెంట్  ఇందులో ఏం ఉంది?
 
 బాలీవుడ్‌ దిగ్గజం, బిగ్‌బి అమితాబ్‌ ఫుట్‌బాల్‌ శిక్షకుడి పాత్రలో నటించిన ‘ఝుండ్‌’ మార్చి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర టీమ్ ‘ఝుండ్‌’ టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ ని ఇక్కడ చూడండి.

 

ఇక టీజర్ లో ఓ ప్లే గ్రౌండ్‌లో బస్తీ పిల్లలంతా డప్పు శబ్దాలు చేస్తుండగా.. బిగ్‌ బి ఫుట్‌బాల్‌ కోచ్‌గా ఎంట్రీ ఇచ్చిన తీరు అదిరిపోయేలా ఉంది. అజయ్‌ అతుల్‌ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫుట్‌బాల్‌ ఆటగాడు విజయ్‌ బార్సే జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్‌ ఫుట్‌బాల్‌ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడి బానిసలుగా మారిన వీధి బాలలను మామూలు మనుషులుగా మార్చి వారితోనే ఫుట్‌బాల్‌ జట్టు తయారు చేస్తారు అమితాబ్‌. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మరాఠి చిత్రం ‘సైరాట్‌’ దర్శకుడు నాగరాజ్‌ మంజులే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

‘సైరాట్‌’తో జాతీయ పురస్కారం సాధించిన దర్శకుడు నాగరాజ్‌ మంజులే, అమితాబ్‌ ‘ఝుండ్‌’ పై అభిమానుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఉండగా  కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.  టీజర్ ను షేర్ చేస్తూ అమితాబ్ ఏమన్నారంటే.. ``మేరీ టీమ్ తయార్ హై ఔర్ ఆప్? ఆ రహే హై హమ్ #Jhund చిత్రం 4 మార్చి 2022న మీ దగ్గరలోని సినిమాహాళ్లలో విడుదల కాబోతోంది టీజర్ నౌ!!`` అని తెలిపారు. T-సిరీస్ - తాండవ్ ఫిలింస్ బ్యానర్లపై భూషణ్ కుమార్- కృష్ణన్ కుమార్ -రాజ్ హిరేమత్- సవితా హిరేమత్- నాగరాజ్ మంజులే -మీను అరోరా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆకాష్ థోసర్ - రింకూ రాజ్గురు కూడా ఉన్నారు. జుండ్ 4 మార్చి 2022న థియేటర్లలోకి విడుదలవుతోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?