Ram Charan : ఆధ్యాత్మిక సేవలో మెగా పవర్ స్టార్, చాముండేశ్వరి సన్నిధిలో రామ్ చరణ్

Published : Dec 04, 2023, 12:12 PM ISTUpdated : Dec 04, 2023, 12:15 PM IST
Ram Charan : ఆధ్యాత్మిక సేవలో మెగా పవర్ స్టార్, చాముండేశ్వరి సన్నిధిలో రామ్ చరణ్

సారాంశం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆధ్యాత్మిక సేవల  ఉన్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన.. షెడ్యూల్ గ్యాప్ లో ఛాముంఢేశ్వరీ దేవి అమ్మవారిదర్శనం చేసుకున్నారు. 

ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం కర్నాటకలో ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.  శంకర్ డైరెక్షన్ లోతెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. దాదాపుగా ఈ షెడ్యూల్ లో షూటింగ్ అంతా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. లాంగ్ షెడ్యూల్ తో షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు టీమ్. అటు రామ్ చరణ్ కూడా గ్యాప్ లేకుండా సినిమాను కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాషూటింగ్ అయిపోగానే.. కాస్త గ్యాప్ తీసుకుని వెంటనే బుచ్చిబాబు సినిమాలోకి జంప్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు రామ్ చరణ్. ఇక ఈక్రమంలో చరణ్ ఆథ్యాత్మిక సేవలో తరించడం చర్చనీయాంశం అయ్యింది. 

చరణ్ కు దైవ భక్తి ఎక్కువ..ప్రతీ ఏడాది పక్కగా అయ్యప్ప మాల వేసుకుంటారు. గుళ్లు గోపురాలకు వెళ్లడం కూడా ఎక్కువగా.. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మైసూర్ చాముంఢేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఆదివారం తెల్లవారుజామున చాముండి కొండపై కొలువైన అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  చరణ్ రాకతో దేవాలయ ప్రాంగణంత కోలాహలం నెలకోంది.  కార్యక్రమాలను నిర్వహిచారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్  సినిమా షూటింగ్ కోసం మైసూర్ లో ఉన్నారు చరణ్. మూవీ టీమ్ తో కలిసి ఆయన  దేవుడి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన వీడియోలు ఫోటోలు  వైర‌ల్‌ అవుతున్నాయి. 

Janhvi Kapoor: జాన్వీ కపూర్ హోమ్ టూర్.. ఫస్ట్ టైమ్ తన ఇంటిని చూపిన బ్యూటీ, వైరల్ వీడియో

ఇక గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ లోనే కాకుండా. కన్నడ పరిశ్రమలో కూడా ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.  శంకర్ దర్శకత్వంలో వస్తుండటంతో తమిళనాట కూడా ఈసినిమాపౌ చర్చ కొనసాగుతోంది. ఇక గ్లోబల్ స్టార్ గా పేరు రావడంతో.. దేశ వ్యాప్తంగా అభిమానులు చరణ్ సినిమాకోసం ఎదరు చూస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?