#Aadikeshava USA ప్రీమియర్స్ కాన్సిల్ !కారణం?

Published : Nov 23, 2023, 09:57 AM IST
 #Aadikeshava  USA ప్రీమియర్స్ కాన్సిల్  !కారణం?

సారాంశం

ఈ చిత్రం  USA ప్రీమియర్స్ కాన్సిల్ చేసారు. రెగ్యులర్ షోలు యుఎస్ లో 24 నుంచి పడనున్నాయి. అంటే యుఎస్ టాక్ రాదన్నమాట. 


 వైష్ణవ్‌ తేజ్‌ (Aadikeshava), శ్రీలీల (Sree Leela) జంటగా రూపొందిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.   మేకర్స్ ప్రమోషన్స్‌ని మొదలెట్టారు. ట్రైలర్ వదిలారు. దానికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.  సోషల్ మీడియాలో అయితే ఈ ట్రైలర్ పై నెగిటివ్ ట్రెండ్ అవుతోంది. మరో ప్రక్క నిర్మాత నాగవంశీ మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. ఈ రోజున పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. రీసెంట్ గా ఈ బ్యానర్ నుంచి వచ్చిన సర్, మ్యాడ్ సినిమాలు  రెండూ పెయిడ్ ప్రీమియర్స్ వేసారు.అవి సక్సెస్ అయ్యాయి. ఇక ఈ చిత్రం  USA ప్రీమియర్స్ కాన్సిల్ చేసారు. రెగ్యులర్ షోలు యుఎస్ లో 24 నుంచి పడనున్నాయి. అంటే యుఎస్ టాక్ రాదన్నమాట. 

ఇక ఈ చిత్రం టీమ్ హైదరాబాద్‌లో ‘ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌’ (Aadikeshava Release Press Meet) నిర్వహించింది. వైష్ణవ్‌, శ్రీకాంత్‌తోపాటు నిర్మాత నాగవంశీ హాజరయ్యారు. ‘‘ఆదికేశవ’ విషయంలో నమ్మకంగా ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ప్రీమియర్స్‌ వేస్తాం. సెంటిమెంట్‌గా తిరుపతిలోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేస్తాం’’ అని నాగవంశీ తెలిపారు. .
 
  శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఆదికేశవ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. వైష్ణవ్‌కు ఇది నాల్గవ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.   నిర్మాతలు చెప్పినట్లు వైష్ణవ్ తేజ్ తన గత సినిమాలతో పోలిస్తే.. ఈ మూవీలో గెటప్ వైజ్, క్యారెక్టర్ వైజ్ కొత్తగా కనిపించబోతున్నారని అర్ధమవుతుంది. ఇక శ్రీలీల తన క్యూట్ పర్ఫామెన్స్ తో ట్రైలర్ లోనే ఆడియన్స్ మనసు దోచుకుంది. మలయాళ స్టార్ యాక్టర్ ‘జోజు జార్జ్’ ఈ సినిమాలో విలన్ కనిపించబోతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్