
మెగా స్టార్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న 'ఆ రోజు' దాకా ప్రయాణం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఖైదీ నెంబర్ 150 చిత్రం నిర్మాతలు.
మెగాస్టార్ చాలా రోజుల తర్వాత నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక అని అందరికీ తెలిసిందే. అయితే, అంతకాలం ఆగేదెలా అనే అసహనంతో ఉన్న చిరు అభిమానుల వేడక కోసం ఒక సారి టీజర్ మరొకసారి ఆడియో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
ఈ రోజు సాయంకాలం టీజర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన ‘ఖైదీ నంబర్ 150’ ఆయన రాజకీయ, నట జీవితంలో ఒక మలుపు కానుంది. అయితే, ఆ మలుపు ఎటువైపు... అనేదిప్రశ్న.
అందుకే ఆయన అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఈ చిత్రం ఉత్కంఠ పెంచుతూ ఉంది. చిత్ర విడుదల వ్యూహం ఈ ఉత్కంఠను రెట్టింపు చేస్తా ఉంది. విడుదల ముహూర్తం సమీఫంలోనే ఉన్నా, ఇంతవరకు అందించినవి కొన్ని పోస్టర్లు మాత్రమే.
ఈ నిరాశ పోగొట్టేందుకు డిసెంబర్ 8 సాయంకాలం టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయించారు. తర్వాత తర్వాత డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఆడియో విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఆడియో ఈవెంటు ను కూడా చలా గ్రాండ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలందరూ పాల్గొనే ఈ ఈవెంట్కు ముహుర్తం వేదిక విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం.
రామ్ చరణ్ ధృవ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాతో పాటు ఖైదీ నంబర్ 150 ట్రైలర్ను థియేటర్లలో ప్రదర్శస్తారు. ఈ సంరదర్భంగానే ఈ రోజు టీజర్ రిలీజ్ చేస్తున్నారు.
రామ్చరణ్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న ఖైదీ నంబర్ 150కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.