మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ప్యాన్స్ కు పండగే.. ఆ సిచ్యూవేషన్ ఎప్పుడు వస్తుందా.. అని ప్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. క్రిస్ మస్ సందర్భంగా మరోసారి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు మెగా ప్యామిలీ.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi )తో స్టార్ట్ అయ్యి మెగా హీరోల ఫ్యామిలీగా మారిపోయింది. దాదాపు 10 మంది హీరోలు మెగా ప్యామిలీ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇక ఈ హీరోలంతా కలిస్తే ఆ ఫ్రేమ్ ఎంత సందడిగా ఉంటుంది ఊహించుకోండి. అయితే మెగా ఫ్యామిలీ హీరోలంతా అప్పుడప్పుడు అకేషన్స్ కు ఇలా కలుస్తూ ఉండేవారు. ఆ అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో శేర్ చేస్తూ.. ఫ్యాన్స్ కు మంచి ట్రీట్స్ ఇస్తూ ఉండేవారు.
క్రిస్ మస్ సందర్భంగా మెగా యంగ్ హీరోలంతా ఒకే చోట సందడి చేశారు. క్రిస్ మస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ , తో పాటు మెగాస్టార్ కూతుర్లు, నిహారిక దంపతులు, ఉపాసన, స్నేహా రెడ్డి.. ఇంకా మెగా కజిన్స్ కొంత మంది కలసి క్రిస్ మస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ ఫోటోను అల్లు అర్జున్ భార్య స్నేహా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ముఖ్యంగా దీపావళి, క్రిస్ మస్ లాంటి ఫెస్టివల్స్ లో మెగా హీరోలు.. కజిన్స్ అంతా కలిసి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య మెగా హీరోలలో బన్నీ-రామ్ చరణ్ మధ్య మరస్పర్దలు కారణంగా ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు అన్న రూమర్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. కాని వాటిలో నిజం లేదని నిరూపించడానికి అప్పుడప్పుడు అకేషన్స్ కు కలుస్తూ.. ఉన్నారు స్టార్ హీరోలు. లాస్ట్ ఇయర్ నిహారిక పెళ్ళిలో కూడా అందరూ కలిసి సందడి చేశారు. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా.. మెగా ఫ్యామిలీ ఒక తాటిపైకి వచ్చారు. ఇలా మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో సందడిచేస్తూనే ఉన్నారు.
Also Read : Sai Pallavi: బాలీవుడ్ కు సాయి పల్లవి.. కాని కండీషన్స్ అప్లై అంటోంది..
అయితే నిన్న క్రిస్ మస్ పార్టీ ఫ్రేమ్ లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి,( Chiranjeevi) పవర్ స్టార్ , నాగబాబు, అల్లు శిరీష్, చిరంజీవి చిన్నల్లుడు హీరో కల్యాణ్ దేవ్ మిస్ అయ్యారు. అల్లు అర్జున్ (Allu Arjun)పుష్ప సక్సెస్ జోష్ లో ఉన్నాడు. రామ్ చరణ్ (Ramcharan )ట్రిపుల్ ఆర్(RRR) ప్రమోషన్ హడావిడిలో ఉన్నాడు, సాయి తేజ్, వైష్ణవ్ తమ సినిమాల బిజీలో ఉన్నారు. అంతా ఎవరికి వారు బిజీగా ఉన్నా సరే.. సెలబ్రేషన్ కోసం ఒక చోట కలవడంతో మెగా ప్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు.