మెగా డాటర్‌ సుస్మిత పెళ్లి రేర్ సంగీత్‌ వీడియో.. చిరు, వెంకీ, బన్నీ, చరణ్‌, సాయితేజ్‌, శ్రీజ కిర్రాక్‌ డాన్స్

Published : Jan 06, 2025, 05:52 PM ISTUpdated : Jan 06, 2025, 06:05 PM IST
మెగా డాటర్‌ సుస్మిత పెళ్లి  రేర్ సంగీత్‌ వీడియో.. చిరు, వెంకీ, బన్నీ, చరణ్‌, సాయితేజ్‌, శ్రీజ కిర్రాక్‌ డాన్స్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పెళ్లికి సంబంధించిన అరుదైన సంగీత్‌ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో స్టార్స్ డాన్సులు కిర్రాక్‌ అనిపించేలా ఉన్నాయి.   

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ఎంతటి అత్యున్నత స్థాయికి చేరుకున్నాడో తెలిసిందే. ఇప్పటికీ ఆయన టాలీవుడ్‌లో మెగాస్టార్‌గానే రాణిస్తున్నారు. ఆదరణ పొందుతున్నారు. ఆ పెద్దరికాన్ని కొనసాగిస్తున్నారు.

ఇండస్ట్రీలోనూ ఆయనకు చాలా వరకు మంచి పేరే ఉంది. ఆయన తర్వాత ఆయన ఫ్యామిలీ నుంచి దాదాపు పది మంది నటీనటులు వచ్చారు. రాణిస్తున్నారు. ఓ మహా వృక్షాన్ని నిర్మించారు చిరు.

చిరంజీవి కూతురు సుస్మిత రేర్‌ సంగీత్‌ వీడియో..

తాజాగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతుంది. సుస్మిత సంగీత్‌ కార్యక్రమానికి చెందిన ఓ అరుదైన వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో మెగా ఫ్యామిలీ చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు.

మెగా హీరోలే కాదు, వెంకటేష్‌, శ్రీకాంత్‌, లారెన్స్ వంటి వారు కూడా డాన్సులు చేసి రచ్చ చేశారు. ఇందులో కమెడియన్‌ అలీ లేడీ గెటప్‌లో  స్టేజ్‌ని ఊర్రూతలూగించారు. ఆయన డాన్స్ కి అంతా ఫిదా అయ్యారు. 

వెంకటేష్‌, శ్రీకాంత్‌ కిర్రాక్‌ డాన్సులు

అలీ లేడీ గెటప్‌లో డాన్స్ చేస్తుంటే లారెన్స్ వచ్చి స్టెప్పులేశారు. ఆ ఊపులో వెంకటేష్‌ కూడా వచ్చాడు. వెంకీ రావడంతో చిరంజీవి వచ్చాడు. ఇక శ్రీకాంత్‌ ఆపుకోలేక ఎగిరి గంతులేశాడు.

వీరంతా కలిసి ఒకే వేదికపై డాన్సులు చేయడం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సంగీత్‌ కార్యక్రమానికి అసలైన హంగులు అద్దింది. కొత్త కళ తీసుకొచ్చింది. వారిఫ్యామిలీ, బంధువుల్లో జోష్‌ని తీసుకొచ్చారు. 

అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, సుస్మిత డాన్స్ హైలైట్‌..

వీరితోపాటు అల్లు అర్జున్‌ కూడా తనదైన డాన్సులతో ఇతరగదీశాడు. ఆయన చాలా సేపు డాన్సు చేశాడు. మరోవైపు రామ్‌ చరణ్‌ కూడా  అదరగొట్టాడు. సుస్మిత సైతం స్టేజ్‌పైకి వచ్చి డాన్సు చేసింది. కాసేపు శ్రీజ నృత్యం చేస్తూ ఆకట్టుకుంది.

ఈ క్రమంలో కుర్ర హీరోలంతా వచ్చేశారు. చరణ్‌, వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌ కూడా స్టేజ్‌మీదకు వచ్చి అక్క సుస్మితతో కలిసి డాన్సు చేశారు. అలాగే శ్రీజ, నిహారిక కూడా వీరితో కలిశారు. దీంతో వీక్షకులంతా అరుపులతో హోరెత్తించారు. 

పవన్‌ మిస్సింగ్‌..

అయితే ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కనిపించలేదు. అలాగే వైష్ణవ్‌ తేజ్‌ కూడా కనిపించలేదు. వీరిద్దరికి సిగ్గు అనే విషయం తెలిసిందే. అందుకే కాస్త దూరంగా ఉన్నట్టుంది. వీడియోలో కనిపించలేదు. కానీ ఈ అరుదైన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది.

మెగా ఫ్యామిలీని గతంలో ఇలా చూస్తుంటే ఆద్యంతం కనువిందుగా ఉంది. ఇది మెగా ఫ్యాన్స్ కి మాత్రం బెస్ట్ ట్రీట్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?