అదే నిజమైతే మెగా డాటర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే..!

First Published 4, Apr 2018, 1:57 PM IST
Highlights
అదే నిజమైతే మెగా డాటర్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లే..!

టాలీవుడ్ పరిశ్రమకు చెందిన కొణిదల వారి అమ్మాయి నిహారిక ఒక మనసు చిత్రంతో నటిగా మారింది. తొలి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా నిహారిక నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒక మనసు చిత్రం తరువాత నిహారిక ఆచి తూచి అడుగులు వేస్తోంది. కేవలం తెలుగులో మాత్రమే కాక తమిళ చిత్రాల్లో కూడా నటిస్తోంది.

 

ఇప్పుడిప్పుడే నటిగా రాణిస్తున్న మెగా డాటర్ నిహారికకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు ఫిల్మ్ నగర్ టాక్. తన పెదనాన్న, మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నిహారికకు ప్రత్యేక పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

 

కొణిదల కుటుంబం నుంచి నటిగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి నటి నిహారిక. ఒక మనసు చిత్రంతో నిహారిక హీరోయిన్ గా మారింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ నిహారికకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నిహారిక కేవలం తెలుగు చిత్రాల్లోనే కాక తమిళ చిత్రాల్లో సైతం నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే తెలుగులో సుమంత్ అశ్విన్ సరసన హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నటిస్తోంది.

 

నిహారిక తాజాగా ఓ బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు నిహారికకు అవకాశం వచ్చిందనేది ఈ వార్తల సారాంశం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చా సుదీప్ తదితర ప్రముఖ నటులు సైరా చిత్రంలో నటిస్తున్నారు.

 

సైరా చిత్రంలో నటించే అవకాశం రావడం నిహారిక కెరీర్ కు పెద్ద బూస్ట్ అని అంటున్నారు. నిహారిక ఈ చిత్రంలో ఎలాంటి రోల్ లో కనిపించబోతోంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది. నిహారిక రోల్ ఖాయమైతే సైరా చిత్రం గురించి మెగా అభిమానుల్లో జోరుగా చర్చ జరగడం ఖాయం.

 

ఇక సైరాను అత్యద్భుతంగా తీర్చిదిద్ది అభిమానులని రంజింపజేయాలని నిర్మాత రాంచరణ్ భావిస్తునాడు. సైరా చిత్రం దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఖర్చు ఎంతైనా వెనకాడకుండా బాహుబలి తరహాలో అద్భుత దృశ్యకావ్యాన్ని తెరకెక్కించాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నారు.

Last Updated 4, Apr 2018, 1:57 PM IST