అన్నయ్య భుజంపై చేయి వేసిన తమ్ముడు.. వరుణ్ తేజ్ పెళ్లిలో మరో మెగా ఫోజు, వైరల్

Published : Nov 03, 2023, 08:54 AM IST
అన్నయ్య భుజంపై చేయి వేసిన తమ్ముడు.. వరుణ్ తేజ్ పెళ్లిలో మరో మెగా ఫోజు, వైరల్

సారాంశం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకతో దంపతులుగా మారారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు.తన తమ్ముడు నాగబాబు కొడుకు పెళ్ళికి చిరు కుటుంబ పెద్దగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. రాంచరణ్, అల్లు అర్జున్ పిల్లాపాపలతో సందడి చేశారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకతో దంపతులుగా మారారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మిస్టర్ మూవీతో మొదలైన వీరి ప్రేమాయణం రహస్యంగా సాగింది. వీరిద్దరూ అఫీషియల్ గా కనిపించే వరకు ఒక్క రూమర్ కూడా రాలేదు. ఎంతో అందంగా, క్యూట్ గా కనిపిస్తున్నా ఈ జంట దంపతులు కావడంతో సోషల్ ఇండియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

వరుణ్ తేజ్ పెళ్ళిలో మెగా ఫ్యామిలీ సంబరాలు హైలైట్ గా నిలిచాయి. తన తమ్ముడు నాగబాబు కొడుకు పెళ్ళికి చిరు కుటుంబ పెద్దగా వ్యవహరించారు. పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. రాంచరణ్, అల్లు అర్జున్ పిల్లాపాపలతో సందడి చేశారు. వైష్ణవ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ ఇలా ప్రతి ఒక్కరూ వరుణ్ పెళ్ళికి హాజరై హంగామా చేశారు. 

అయితే పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ ఒక్క ఫ్రేమ్ లో కనిపించడం మెగా అభిమానులకు కనుల విందుగా మారింది. కొన్ని ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ముగ్గురు మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ సూపర్ కూల్ గా, స్టైలిష్ గా ఫోజు ఇచ్చారు. 

ఈ ఫొటోలో చిరు నాగబాబు సోఫాలో కూర్చుని ఉన్నారు. పక్కనే పవన్ కళ్యాణ్ చిరు బుజం పై చేసాయి వేసి ఇంటెన్స్ గా ఇస్తున్న ఫోజు అదిరిపోయింది. ముగ్గురు మెగా బ్రదర్స్ స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతున్నారు. మరో పిక్ లో పవన్ కళ్యాణ్, రాంచరణ్ చిరునవ్వులతో నడుస్తూ వస్తున్నారు. ఈ పిక్ కి మెగా పవర్ ఫుల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌