ఊరమాస్ గా చిరు ‘మెగా 154’ మూవీ టైటిల్.. రివీల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

Published : Apr 30, 2022, 04:52 PM IST
ఊరమాస్ గా చిరు ‘మెగా 154’ మూవీ టైటిల్.. రివీల్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

సారాంశం

మెగా స్టార్ చిరంజీవి వరుస చిత్రాల్లో నటిస్తూ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ రిలీజ్ కాగా.. తాజాగా బాబీ డైరెక్షన్ లో నటిస్తున్న ‘మెగా 154’ టైటిల్ రివీల్ అయ్యింది. చిరంజీవే స్వయంగా చెప్పడంతో టైటిల్ కన్ఫమ్ అయ్యింది.      

మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ (Acharya) రిలీజ్ అవడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ మిశ్రమ స్పందనతో కొంత అప్సెట్ అయ్యారు. కానీ ఆయన అప్ కమింగ్ ఫిల్మ్స్ ‘గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154’ చిత్రాలపై బలమైన ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు చిరంజీవి కూడా మెగా అభిమానుల అంచనాలు తగ్గకుండా తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై పక్కాగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ‘గాడ్ ఫాదర్, భోళా శంకర్, Mega 154’ చిత్రాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. 

ఈ సందర్భంగా మెగా అభిమానులు ఖుషీ అయ్యే మాటను చిరంజీవి నోటనే చెప్పారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మెగా 154’. ఈ చిత్ర టైటిల్ ను ఇప్పటి వరకు మేకర్స్, డైరెక్టర్ ఎవరూ అఫిషియల్ గా రిలీల్ చేయలేదు. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నోటమాటజారి ‘వాల్తేరు వీరయ్య’గా వినిపించింది. అప్పటికే ఈ టైటిల్ ప్రచారంలో ఉంది. శేఖర్ మాస్టర్ రివీల్ చేయడంతో కన్ఫమ్ అయ్యింది. అయితే అదే టైటిల్ ను తాజాగా చిరంజీవి (Chiranjeevi) నోట వినిపించింది. మెగా 154 చిత్ర టైటిల్ వాల్తేరు వీరయ్యగా తెలిపారు. దీంతో చిత్ర టైటిల్ పక్కా అయినట్టు తెలుస్తోంది.  

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మెగా 154 నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సముద్రంలోకి బోట్‌లో చేపల వేటకి వెళ్తున్న చిరంజీవి బ్యాక్‌ సైడ్‌ లుక్‌ అదిరిపోయింది. అయితే ఇందులో చిరు లుంగీ కట్టడం విశేషం. సినిమా ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది. అయితే అందుకు తగ్గట్టుగానే మాస్ టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ను ఖరారు చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.  

బాబీ దర్శకత్వంలో వస్తున్న మెగా 154 చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. అదేవిధంగా చిరు `గాఢ్‌ ఫాదర్‌` చిత్రాన్ని మోహన్‌రాజా డైరెక్ట్ చేస్తుండగా.. నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో జాయిన్‌ అయ్యింది. మరోవైపు మెహర్‌ రమేష్‌తో `భోళాశంకర్‌` సినిమా చేస్తున్నారు చిరు. ఇందులో ఆయనకు చెల్లిగా కీర్తిసురేష్‌, హీరోయిన్‌గా తమన్నా నటిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?