మీరాచోప్రా 'టీకా ఐడి' వివాదం,ట్వీట్ తో ట్విస్ట్

By Surya PrakashFirst Published May 31, 2021, 7:25 AM IST
Highlights


బాలీవుడ్‌ నటి మీరా చోప్రా ఏదో ఒక వివాదంతో ఎప్పూడూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా  నిబంధనలను అతిక్రమించి వ్యాక్సిన్‌ వేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదంపై ఆమె స్పందించింది. 

 నటి, మోడల్ మీరా చోప్రా ఈమధ్యే కరోనా వ్యాక్సిన్​ వేయించుకుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్​ వేయించుకోవాలని ఆమె తన ఇన్​స్ట్రాగ్రామ్​లో ఆ ఫొటోను ఉంచింది. అయితే ఆమె ఫ్రంట్​లైన్​ వారియర్​ కోటాలో ఫేక్​ఐడీతో ఈ పని చేసినట్లు తెలిసింది. ఆమె థానేలోని పార్కింగ్​ ప్లాజా వ్యాక్సినేషన్​ సెంటర్​ దగ్గర డోస్​ వేయించుకుంది.

 ఓం సాయి ఆరోగ్య కేర్​ ప్రైవేట్ లిమిటెడ్​లో ఆమె సూపర్​వైజర్​గా పని చేస్తున్నట్లుగా ఓ ఫేక్​ ఐడీ క్రియేట్ చేశారు. ఇది ముమ్మాటికీ రూల్స్​ను ఉల్లంఘించినట్లే. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ కోరుతోంది. కాగా, ఈ విచారణపై దర్యాప్తునకు ఆదేశించామని, ఆరోపణలు రుజువైతే మీరా చోప్రాపై క్రిమినల్ చర్యలు తప్పవని థానే మున్సిపల్ కార్పొరేషన్​ పీఆర్వో సందీప్​ మాల్వీ​ చెబుతున్నారు.  ఈ విషయమై పై థానే మున్సిపల్‌ కార్పొ రేషన్‌ (టీఎంసీ) దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై 3రోజుల్లో నివేదిక అందించాలని టీఎంసీ కమిషనర్‌ ఆదేశించినట్టు అధికా రులు తెలిపారు. తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకుంటా మని చెప్పారు.

ఈ విషయమై మీరా చోప్రా స్పందించింది...ఈ వార్తలను తాను ఖండిస్తున్నట్లు తెలియచేసారు. తాను వెరిఫికేషన్ కోసం కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే ఇచ్చానని, అంతకు మించి ఏమీ ఇవ్వలేదని పేర్కొంది. వివాదానికి కారణమైన ఫేక్ ఐడినీ ఎవరో ఫొటో షాప్ చేసారని చెప్పింది. దానితో తనకు సంభంధం లేదని తేల్చేసింది.
 
 తెలుగులో బంగారం, మారో, వాన లాంటి సినిమాల్లో నటించిన మీరా చోప్రా.. పలు తెలుగు, తమిళ్​, హిందీ చిత్రాల ద్వారా గుర్తింపు దక్కించుకుంది. అయితే వ్యాక్సినేషన్​పై దుమారం చెలరేగడంతో ఆమె తన ఇన్​స్టాగ్రామ్​ నుంచి పోస్ట్​ తొలగించడంతో పాటు మీడియాకు దొరక్కుండా తిరుగుతోందని బయిట ప్రచారం జరుగుతోంది.
 

My statement on the articles that has been coming out fr my vaccine shot!! pic.twitter.com/wDE70YHsMo

— meera chopra (@MeerraChopra)
click me!