షాకింగ్.. హీరోయిన్ మీనా ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ పాజిటివ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 05, 2022, 03:59 PM IST
షాకింగ్.. హీరోయిన్ మీనా ఫ్యామిలీ మొత్తానికి కోవిడ్ పాజిటివ్

సారాంశం

కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. మంగళవారం ఒక్కరోజే దేశంలో 58వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో అన్ని రాష్ట్రాల్లో నెమ్మదిగా కోవిడ్ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి.

కరోనా థర్డ్ వేవ్ మొదలైంది. మంగళవారం ఒక్కరోజే దేశంలో 58వేల కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో అన్ని రాష్ట్రాల్లో నెమ్మదిగా కోవిడ్ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగా సినీ తారలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. 

బాలీవుడ్ సెలెబ్రిటీలు ఎక్కువగా కరోనా బారిన పడుతుండడం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో కూడా విశ్వక్ సేన్, మంచు మనోజ్ లాంటి హీరోలు కోవిడ్ కి గురయ్యారు. తాజాగా మరో సౌత్ సెలెబ్రిటీ కరోనాకు గురయ్యారు. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందిన మీనాకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. షాకింగ్ విషయం ఏంటంటే మీనా మాత్రమే కాదు ఆమె ఫ్యామిలీ మొత్తం కోవిడ్ బారిన పడ్డారు. 

ఈ విషయాన్ని మీనా సోషల్ మీడియాలో విభిన్నంగా పంచుకున్నారు. '2022లో మా ఇంటికి వచ్చిన మొదటి అతిథి మిస్టర్ కరోనా. నాతో పాటు మా ఫ్యామిలీ మొత్తాన్ని కరోనా బాగా ఇష్టపడింది. కానీ దానిని ఎక్కువరోజులు మా ఇంట్లో ఉండనివ్వను' అంటూ మీనా చమత్కారంగా స్పందించారు. 

 

ప్రజలంతా అప్రమత్తంగా, సేఫ్ గా ఉండాలని మీనా సూచించారు. మీనా చివరగా రజినీకాంత్ అన్నాత్తే, వెంకటేష్ దృశ్యం 2 చిత్రాల్లో నటించారు. దృశ్యం 2 చిత్రానికి ఓటిటిలో విశేష స్పందన లభిస్తోంది. 

దేశంలో కొరోనాతో పాటు కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కూడా నెమ్మదిగా వ్యాపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా ఇండియాలో కూడా థర్డ్ వేవ్ మొదలైపోయింది. 

Also Read: Naga Chaitanya: అల్ట్రా స్టైలిష్ లుక్ లో చిన బంగార్రాజు.. నాగ చైతన్య కోసం జనసంద్రంగా మారిన రాజమండ్రి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు