Ashok Galla:‘హీరో’ ఓటీటి ఫ్లాట్ ఫామ్ లాక్

Surya Prakash   | Asianet News
Published : Jan 05, 2022, 03:44 PM IST
Ashok Galla:‘హీరో’ ఓటీటి ఫ్లాట్ ఫామ్ లాక్

సారాంశం

 జనవరి 7 న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ కావడంతో ఈ సినిమా తెరమీదకు వచ్చింది. యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో అశోక్‌కు జోడీగా నటి నిధి అగర్వాల్‌ సందడి చేయనున్నారు. 

తెలుగు దేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర టీమ్ అధికారికంగా ప్రకటించింది. మొదట ఈ  జనవరి 26 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది.  అయితే ఇప్పుడు సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటి నుంచి తప్పుకోవటంతో జనవరి 15కే విడుదల అవుతోంది. అలాగే ఈ చిత్రం ఓటీటి ప్లాట్ ఫామ్ కూడా ఫిక్సైంది. Disney + Hotstar లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. అయితే థియోటర్ రిలీజ్ అయిన కొద్ది కాలం తర్వాతే ఈ సినిమా విడుదల కానుంది.

 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 15 న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 7 న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ కావడంతో ఈ సినిమా తెరమీదకు వచ్చింది. యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో అశోక్‌కు జోడీగా నటి నిధి అగర్వాల్‌ సందడి చేయనున్నారు. జగపతిబాబు, నరేశ్‌, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. అమరరాజా మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఈ సంక్రాంతి రేసులో బంగార్రాజు, డీజే టిల్లు చిత్రాలతో పాటు హీరో కూడా జాయిన్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ కావడం వలన ఈ సినిమాలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రాలలో సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలబడతారో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు