మస్త్ జబర్థస్త్ అప్ డేట్ ఇచ్చిన మాస్ మహారాజ్, ఫ్యాన్స్ కు ట్రీట్ రెడీ చేసిన రవితేజ

Published : Jun 11, 2023, 02:36 PM IST
మస్త్ జబర్థస్త్ అప్ డేట్ ఇచ్చిన మాస్ మహారాజ్, ఫ్యాన్స్ కు ట్రీట్ రెడీ చేసిన రవితేజ

సారాంశం

గెలుపోటములు పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ వెళ్తున్న రవితేజ.. తాజాగా తన కొత్త సినిమాకు సబంధించి ఓ అనౌన్స్ మెంట్ చేశాడు.   

మాస్ రాజా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పుల్  బిజీ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా ధమాకాతో తిరుగులేని సక్సెస్ అందుకున్న రవితేజ.. అంతకు ముందు వరుస పెయిల్యూర్స్ చూశాడు. ఇక తాజా హిట్ తో  అదే జోష్ ను తన నెక్ట్స్ సినిమాలకు కూడా చూపించలేకపోయాడు. తాజాగా రిలీజ్ అయిన రావణాసుర సినిమా దారుణ పరాజయాన్ని చూసింది. రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

ఇక ప్రస్తుతం రవితేజ ఫ్యాన్స్ తో పాటు.. మాస్ మహారాజ్ కూడా ఆశలన్నీ  టైగర్ నాగేశ్వరరావు సినిమాపైనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలను క్రియేట్ చేసింది. అందులోను పేరు మోసిన దొంగ కథ కావడంతో.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయెపిక్ గా తెరకెక్కుతుంది. దసరా కానుకగా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంతట ఆసక్తి నెలకొంది. 

 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ను అందించారు మూవీ టీమ్. ఈ సినిమా కంప్లీట్ అవ్వక ముందే..  రవితేజ తన కొత్త సినిమా వివరాలు ప్రకటించబోతున్నాడు. ఆయన తన నెక్ట్స్ నిమాను  పీపుల్ మీడియా బ్యానర్ పై చేస్తున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుపమ, కావ్య థాపర్‌ నటిస్తున్నారు.

ఈగల్ అనే పేరును ఈ సినిమా కోసం రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చాలా సైలెంట్ గా జరుగుతుంది.  ఈ మూవీ సెట్స్ మీద ఉన్నట్టు కూడా చాలా వరకూ తెలియదు. కాగా ఈమూవీకి సంబంధించిన ఓ అప్  డేన్ ను అందించారు మూవీ టీమ్. ఆ లావాకు ఓ పేరుంది అంటూ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను సోమవారం విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యాక్షన్ బ్యాక్ గ్రౌండ్.. ప్రతీకార నేపథ్యంలో.. ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ మూవీ జాన్ విక్ ఆధారంగా ఈసినిమా రూపొందుతోంది. 


 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?