పెళ్లైన డైరెక్టర్.. యంగ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ!

Published : Sep 19, 2018, 05:55 PM IST
పెళ్లైన డైరెక్టర్.. యంగ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ!

సారాంశం

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన దర్శకుడు తన హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిస్తుంటారంటూ వార్తలు వినిపిస్తుంటాయి. ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించిన అందరితో ఆయనకి రిలేషన్ ఉందని టాక్. 

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన దర్శకుడు తన హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిస్తుంటారంటూ వార్తలు వినిపిస్తుంటాయి. ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించిన అందరితో ఆయనకి రిలేషన్ ఉందని టాక్. అతడు తెరకెక్కించిన ఆఖరి సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసిన ఓ హాట్ బ్యూటీతో తో ఎఫైర్ సాగించారు.

ఆ సినిమా పెద్ద ఫ్లాప్ కావడంతో అతడి పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తోన్న సినిమాతో హిట్ అందుకోలేకపోతే గనుక ఇక కెరీర్ పరంగా అతడికి అవరోధాలు తప్పవు. దీంతో తన ఫోకస్ మొత్తం తదుపరి సినిమాపైనే పెట్టాడు.

ఈ క్రమంలో సదరు హాట్ బ్యూటీకి సమయం ఇవ్వలేకపోవడం, తన తదుపరి సినిమాలో కూడా ఆఫర్ ఇవ్వకపోవడంతో అమ్మడు బాగా హర్ట్ అయిందట. దీంతో ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు ఏర్పడి విడిపోయినట్లు సమాచారం. ఈ డైరెక్టర్ కి పెళ్లై, పిల్లలు ఉన్నా.. తన రాసలీలలకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. ఇప్పుడు తన కొత్త సినిమాలో హీరోయిన్ తో అఫైర్ సాగిస్తున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఏ డైరెక్టర్ లేనంత చార్మింగ్ గా ఉండడం, తన మాటలతో అందరినీ ఆకట్టుకోవడంతో ఎవరైనా ఆయన ఎట్రాక్ట్ అవ్వాల్సిందేనని ఆయనని దగ్గరగా చూసేవాళ్లు చెబుతుంటారు. 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌