ఈలోగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీని సినిమా థియేటర్లోనే విడుదల చేస్తామని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు.
‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల్లో ప్రేమికుడిగా మెప్పించిన యంగ్ హీరో అక్కినేని అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. శరవేగంగా షూటింగ్ జరుపుకొన్న ఈ సినిమా క్రితం సంవత్సరం వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేసారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో కుదరలేదు. దాంతో ఈ వేసవికి ఈ సినిమా రావచ్చు అని రిలీజ్ డేట్ ని ప్రకటించారు. అదీ సాధ్యం కాలేదు.
ఈలోగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీని సినిమా థియేటర్లోనే విడుదల చేస్తామని ఇటీవల నిర్మాణ సంస్థ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి దసరా నాటికి అన్ని చక్కదిద్దుకుంటే ‘బ్యాచిలర్’ బయిటపడచ్చు. హిట్టైతే అఖిల్ ఖాతాలో తొలి హిట్ నమోదు అవుతుంది. ఈ సినిమాపై అఖిల్ చాలా నమ్మకంగా ఉన్నాడు.
ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.
నటీ నటులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమని, మురళి శర్మ, జయ ప్రకాశ్, ప్రగతి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభయ్, అమిత్ తదితరులు..
సాంకేతిక నిపుణులు:
బ్యానర్ : జీఏ2 పిక్చర్స్
సమర్పణ : అల్లు అరవింద్
మ్యూజిక్ : గోపీ సుందర్
సినిమాటోగ్రాఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ
ఎడిటర్ : మార్తండ్ కే వెంకటేశ్
ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా
నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ
దర్శకుడు : బొమ్మరిల్లు భాస్కర్