మనోరమ కుమారుడు ఆత్మహత్యాయత్నం, షాకింగ్ రీజన్

By Surya Prakash  |  First Published Apr 9, 2020, 7:27 AM IST

స్వర్గీయ సీనియర్‌ నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసారు. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అందుకు కారణం తెలిస్తే ఆశ్చర్యం, బాధ కలుగుతుంది.


కరోనా విజృంభణ,లాక్ డౌన్ ఎఫెక్ట్ తో దేశంలో పరిస్దితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ముఖ్యంగా మానసిక సమస్యలు పెరిగేటట్లు ఉన్నాయి. అవి ఆత్మహత్యా ప్రయత్నాలకు దారి తీస్తున్నాయి. తాజాగా స్వర్గీయ సీనియర్‌ నటి మనోరమ కుమారుడు భూపతి నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసారు. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అందుకు కారణం తెలిస్తే ఆశ్చర్యం,బాధ కలుగుతుంది.

వివరాల్లోకి వెళితే..లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు పూర్తిగా మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో మద్యానికి బానిసైన భూపతి ఆ బాధను భరించలేక, మానసిక ఒత్తిడికి గురయ్యారు. చివరికి మద్యం లభించకపోవడంతో అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకున్నారని సమాచారం. దీన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

Latest Videos

undefined

ఇక దేశ వ్యాప్తంగా మద్యానికి అలవాటు పడిన వారిలోచాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. లిక్కర్ విత్ డ్రాయల్ సిండ్రోమ్‌తో వారు పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. కొందరు ఇళా ఆత్మహత్యాయత్నాలు కూడా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొందరు మద్యం దొరక్క ఇతరత్రా మెడికల్ షాపుల్లో దొరికిన వాటిని కొనుక్కొని తాగుతున్నారు.

ఇవన్నీ గమనించే ఇటీవల కేరళ ప్రభుత్వం మద్యానికి బానిసలైన వారికోసం ఓ ప్రతిపాదన కూడా  తీసుకొచ్చింది. వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మద్యం విక్రయించే ప్రతిపాదన తీసుకొచ్చింది. అయితే, దీన్ని కోర్టు కొట్టివేసింది. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏకంగా మద్యం హోం డెలివరీ అనే ప్రతిపాదన తెచ్చింది. 
 
ఇవన్నీ గమనించే రిషి కపూర్.. మద్యం దుకాణాల్ని పూర్తిగా మూసివేయడం గురించి ట్వీట్‌ చేశారు. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేసినప్పటికీ.. కొంత సమయంపాటు మద్యం దుకాణాల్ని తెరవాలని కోరారు.
 

click me!