పెద్ద సినిమాల వాయిదా.. చిన్న చిత్రాలకు వరం.. నాని డేట్‌ని టార్గెట్‌ చేసిన మరో సినిమా!

Published : Apr 14, 2021, 06:44 PM IST
పెద్ద సినిమాల వాయిదా.. చిన్న చిత్రాలకు వరం.. నాని డేట్‌ని టార్గెట్‌ చేసిన మరో సినిమా!

సారాంశం

మరికొన్ని సినిమాలు వాయిదా పడబోతున్నాయి. అయితే ఇది చిన్న చిత్రాలకు వరంగా మారింది. పెద్ద సినిమాలు పోస్ట్ పోన్‌ కావడంతో చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 

కరోనా కేసులు మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో వరుసగా ఓ రేంజ్‌ సినిమాల నుంచి, స్టార్‌ హీరోల చిత్రాల వరకు వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే `లవ్‌స్టోరీ`, `టక్‌ జగదీష్‌`, `విరాటపర్వం` చిత్రాలు వాయిదా పడ్డాయి. మరికొన్ని సినిమాలు వాయిదా పడబోతున్నాయి. అయితే ఇది చిన్న చిత్రాలకు వరంగా మారింది. పెద్ద సినిమాలు పోస్ట్ పోన్‌ కావడంతో చిన్న చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా `ఆర్జీవీ దెయ్యం` ఈ వారంలో వస్తుండగా, తేజ సజ్జా నటించిన `ఇష్క్` సినిమా వచ్చే వారం రాబోతుంది. 

`టక్‌ జగదీష్‌` సినిమా ఈ నెల 23న రానుండగా, వాయిదా పడింది. ఇప్పుడు అదే తేదీనికి మరో యంగ్‌ హీరో మనోజ్‌ నందన్‌ నటించిన సినిమా `కథానిక` విడుదలకు రెడీ అవుతుంది. థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకం పై మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లుగా  రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్యతారాగణం తో జగదీష్ దుగన దర్శకత్వంలో పద్మ లెంక  నిర్మిస్తున్న చిత్రం `కథానిక`. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన  ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల అవుతుంది. 

ఈ సందర్భంగా కథ, మాటలు, సంగీతం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన జగదీష్ దుగన మాట్లాడుతూ, `కథానిక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. మంచి గ్రిప్పింగ్ కథ కథనంతో ఊహకందని మలుపులతో మంచి నటి నటులతో నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. మనోజ్ నందన్, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ల నటన ఈ చిత్రానికే హైలైట్ అవుతుంది. మా చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నాము. అందరికి నచ్చే చిత్రమవుతుంది. డిఫరెంట్‌ ఎక్స్ పీరియెన్స్ నిస్తుంది` అని తెలిపారు. నిర్మాత పద్మ లెంక చెబుతూ, ``కథానిక` చిత్రాన్ని ఎంతో ప్యాషన్ తో నిర్మించాము. డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చింది. ఎక్కడ రాజీపడకుండా నిర్మించాము. సినిమా చాలా బాగా వచ్చింది. సంగీతం, కథ  కథనం మా చిత్రం లో హైలైట్ గా నిలిచాయి. రెండు తెలుగు రాష్టాల్లో విడుదల చేస్తున్నాం` అని తెలిపారు. 

వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి. ఈ నెల 30న, అలాగే మే నెలలో చిన్న సినిమాల హవా కొనసాగనుందని చెప్పొచ్చు. ఓ రకంగా ఈ చిత్రాలకు పెద్ద రిలీఫ్‌ అనే చెప్పాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కమన్‌ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్