సైకిల్‌పై `ఆచార్య` సెట్‌కి సోనూసూద్‌..వీడియో వైరల్‌.. విజయ్‌ మాదిరి నిరసన?

Published : Apr 14, 2021, 04:31 PM IST
సైకిల్‌పై `ఆచార్య` సెట్‌కి సోనూసూద్‌..వీడియో వైరల్‌.. విజయ్‌ మాదిరి నిరసన?

సారాంశం

సోనూ సూద్‌ తాజాగా ఓ ఆలోచింప చేసే పని చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. సైకిల్‌పై ఆయన షూటింగ్‌ సెట్‌కి వెళ్లారు. దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌ లో  సైకిల్‌ తొక్కుతున్న సోనూ సూద్‌ వీడియో వైరల్‌గా మారింది. 

సోనూ సూద్‌ చేసే ప్రతి పని రియల్‌ హీరో అనిపించేలా ఉంది. ఆయన ఇటీవల పంజాబ్‌ `కోవిడ్‌-19` టీకాకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. పంజాబ్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. తాజాగా ఓ ఆలోచింప చేసే పని చేసి ఆశ్చర్యానికి గురి చేశారు సోనూ సూద్‌. సైకిల్‌పై ఆయన షూటింగ్‌ సెట్‌కి వెళ్లారు. దుర్గం చెరువు ఫ్లై ఓవర్‌ లో  సైకిల్‌ తొక్కుతున్న సోనూ సూద్‌ వీడియో వైరల్‌గా మారింది. 

చిరంజీవి, రామ్‌చరణ్‌ నటిస్తున్న `ఆచార్య` షూటింగ్‌ కోసం సోనూ సూద్‌ సైకిల్‌పై వెళ్లాడు. బుధవారం ఉదయమే ఆయన ఇలా సైకిల్‌పై సెట్‌కి వెళ్లి ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే తనకు సైక్లింగ్‌ అంటే ఇష్టమని, ఉదయాన్నే సెట్‌కి వెళ్లాల్సి వచ్చిందని, అందుకే సైకిల్‌పై వెళ్లాడని తెలిపారు. ఓ వైపు వ్యాయామం అవుతుంది, సెట్‌కి వెళ్లినట్టు ఉంటుందని సోనూ సూద్‌ ఇలా చేశాడట. మొత్తంగా సోనూ సూద్‌ చేసిన పని ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఆ మధ్య తమిళనాడు ఎన్నికల సందర్భంగా స్టార్‌ హీరో సోనూ సూద్‌ సైకిల్‌పై పోలింగ్‌ సెంటర్‌కి వెళ్లి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై తన నిరసన తెలిపారు. అది వైరల్‌గా మారింది. ఇప్పుడు సోనూ సూద్‌ కూడా అదే ఉద్దేశంతో చేశాడా? అన్న డిస్కషన్‌ కూడా జరుగుతుంది. ఇక `ఆచార్య`లో సోనూ సూద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో  ఈ సినిమా రూపొందుతుంది. ఇదిలా ఉంటే సోనూ సూద్‌ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వేల మంది వలస కార్మికులను ఆదుకుని, వారిని సురక్షితంగా వారి ఇండ్లళ్లకి పంపి రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?