'మన్మథుడు 2' ఆ సినిమాకు కాపీనా..?

Published : Jun 14, 2019, 05:08 PM IST
'మన్మథుడు 2' ఆ సినిమాకు కాపీనా..?

సారాంశం

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న నూతన చిత్రం 'మన్మథుడు 2'. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో కనిపించనున్నాడు. 

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తోన్న నూతన చిత్రం 'మన్మథుడు 2'. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

పెళ్లి కాకపోయినా.. అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసే క్యారెక్టర్ లో నాగార్జున కనిపించారు. టీజర్బాగుందని కొందరు ప్రశంసిస్తుంటే.. ఈ వయసులో నాగార్జున అలాంటి క్యారెక్టర్ చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓ ఫ్రెంచ్ సినిమాకు ఫ్రీమేక్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

2006లో వచ్చిన 'prete moi ta main' అనే ఫ్రెంచ్ సినిమాలో కూడా హీరో వయసు మళ్లిన బ్రహ్మచారే.. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఒత్తడి చేయడంతో ఒక అమ్మాయిని భార్యగా అద్దెకు తెచ్చుకుంటాడు. 

మరి 'మన్మథుడు 2' సినిమా కూడా ఇదే కథతో ఉందో.. లేదో.. ట్రైలర్ రిలీజ్ అయితే పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాలో అక్ష‌ర‌గౌడ‌, ర‌కుల్ ప్రీతి సింగ్, కీర్తి సురేష్ లాంటి భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్ట్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌