మన్మథుడిని ముద్దుల్లో ముంచెత్తింది ఆమేనా!

By tirumala ANFirst Published Jun 14, 2019, 4:33 PM IST
Highlights

కింగ్ నాగార్జున చాలా కాలం తర్వాత రొమాంటిక్ అవతారం ఎత్తాడు. నాగార్జునకు మహిళల్లో ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2లో నటిస్తున్నాడు. 'హి లవ్స్ విమెన్' అనేది ఉపశీర్షిక. 

కింగ్ నాగార్జున చాలా కాలం తర్వాత రొమాంటిక్ అవతారం ఎత్తాడు. నాగార్జునకు మహిళల్లో ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం నాగార్జున మన్మథుడు 2లో నటిస్తున్నాడు. 'హి లవ్స్ విమెన్' అనేది ఉపశీర్షిక. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు మన్మథుడు 2 ఎలా ఉండబోతోందో అని. 17 ఏళ్ల క్రితం విడుదలైన మన్మథుడు చిత్రంలో మహిళలంటే ఇష్టం లేని వ్యక్తిగా నాగార్జున నటించాడు. మన్మథుడు 2లో మాత్రం రొమాంటిక్ వీరుడిగా రెచ్చిపోనున్నాడు. 

గురువారం రోజు మన్మథుడు 2 చిత్ర టీజర్ విడుదలయింది. రాహుల్ రవీంద్రన్ నాగార్జున పాత్రని ఫన్నీగా ప్రజెంట్ చేస్తూనే, కింగ్ ఈ చిత్రంలో ఎలాంటి విన్యాసాలు చేయబోతున్నాడో శాంపిల్ చూపించాడు. అమ్మాయిలతో రొమాన్స్, నాగార్జున తనదైన శైలిలో చెప్పే డైలాగులు చాలా ఆసక్తినిరేకెత్తిస్తున్నాయి. 

టీజర్ లో ఇద్దరు అందమైన భామలతో నాగార్జున లిప్ లాక్స్ తో రెచ్చిపోయి నటిస్తాడు. కానీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో మాత్రం చూపించలేదు . రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కానీ టీజర్ లో వారి జాడే లేదు. మరి నాగార్జునతో రొమాన్స్ చేసిన ఆ ఇద్దరూ ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. 

కన్నడ బ్యూటీ అక్షర గౌడ ఈ చిత్రంలో చిన్న పాత్రలో నటిస్తోంది. నాగార్జునతో రొమాన్స్ చేస్తున్న బ్యూటీ అక్షర గౌడనే అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. నాగార్జున ఇంకా ఎంతమందితో రొమాన్స్ చేశాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. 

click me!