అజిత్ కోసం స్వరం సవరించిన మలయాళ బ్యూటీ మంజూవారియర్

Published : Nov 27, 2022, 10:58 AM IST
అజిత్ కోసం స్వరం సవరించిన మలయాళ బ్యూటీ మంజూవారియర్

సారాంశం

అజిత్ కోసం కాస్త స్వరం సవరించింది మలయాళ యంగ్ హీరోయిన్ మంజూవారియర్. గతంలో హిట్ సినిమాలకోసం టైమ్ పాస్ కు పాడిన  మంజూ.. ఈసారి స్టార్ హీరో సక్సెస్ కోసం అలాగొంతు విప్పింది.   

తమిళ స్టార్  అజిత్ హీరోగా  తెరకెక్కుతున్న తాజా మూవీ తుణివు.  జీ సంస్థతో కలిసి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. నెర్కొండ పార్వాయి, వాలిమై తరువాత  దర్శకుడు వినోద్ - అజిత్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా ఇది.  ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్న వేళ.. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈసినిమాను రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈక్రమంలో ఈ సినిమా నుంచి రకరకాల అప్ డేట్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్  పనుల్లో బిజీగా ఉంది మూవీ.  మలయాళ సోయగం మంజు వారియర్ ఈ సినిమాలో హీయిన్ గా నటిస్తోంది. జిబ్రాన్ ఈ సినిమానకు సంగీతం సమకూర్చుతున్నారు.  ఇక ఈమూవీకి సబంధించి ఓ అప్ డేటన్ ను వెల్లడించారు హీరోయిన్ మంజు వారియర్. ఈ సినిమా కోసం తను ఓ పాట పాడినట్టు సోషల్ మీడియలో వెల్లడించారు. అంతే కాదు జిబ్రన్ తో కలిసి ఉన్న ఓఫోటోను ఆమె సోషల్ మీడియాలో శేర్ చేసుకున్నారు. 

 

ఈసినిమా వచ్చే సంక్రాంతి రేసులో ఉండగా.. అదే సమయానికి విజయ్ వారీసు కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈసినిమాను దిల్ రాజునిర్మిస్తున్నారు. సంక్రాంతికి తమిళబాక్సాఫీస్ దగ్గర అజిత్-విజయ్ మధ్య వార్ గట్టిగా నడవబోతున్నట్టుతెలుస్తోంది. మరో వైపు టాలీవుడ్ లో కూడా వారసుడు సినిమాపై గట్టిగా చర్చ నడుస్తోంది. అటు తమిళనాట విజయ్-అజిత్ ప్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తూ బగ్గుమంటుంది. అటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి వార్ ఎలా ఉండబోతుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

అయితే విజయ్ సినిమా రిలీజ్ అవుతుండటంతో.. అజిత్ తుణివు కి..థియేటర్ల కొరత ఉంటుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే ఈక్రమంలో తుణివు మూవీ రిలీజ్ హక్కులను ఉదయనిథి స్టాలిన్ కు సబంధించిన సంస్థ తీసుకోవడంతో.. ఇక థియేటర్ల విషయంలో ఎలాంటి ఢోకా ఉండదనే చెప్పాలి. మరి సంక్రాంతి వార్ లో విజేతగానిలిచేది ఎవరో చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు