మణికర్ణిక: ఫైనల్ గా సెంచరీ కొట్టేసింది

By Prashanth MFirst Published Feb 19, 2019, 4:21 PM IST
Highlights

బాలీవుడ్ వివాదాల సుందరి మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. మణికర్ణిక కలెక్షన్స్ లో సెంచరీ కొట్టేసి హీరోయిన్ గా సరికొత్త రికార్డును సృష్టించింది. వీరనారి ఝాన్సీ 'లక్ష్మి బాయ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక రిలీజ్ అయ్యే వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.

బాలీవుడ్ వివాదాల సుందరి మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటింది. మణికర్ణిక కలెక్షన్స్ లో సెంచరీ కొట్టేసి హీరోయిన్ గా సరికొత్త రికార్డును సృష్టించింది. వీరనారి ఝాన్సీ 'లక్ష్మి బాయ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన మణికర్ణిక రిలీజ్ అయ్యే వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఫైనల్ గా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి 100 కోట్ల వసూళ్లను దాటేసింది. 

అసలైతే సినిమా ఇంకా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవాల్సింది. కేవలం బాలీవుడ్ లోనే మణికర్ణిక రిలీజయింది. సౌత్ లో మంచి మార్కెట్ ఉన్న తెలుగు తమిళ్ లో ఇంకా ఎక్కువ లొకేషన్స్ లో రిలీజ్ చేసి ఉంటే కలెక్షన్స్ నెంబర్  పెరిగేది. దర్శకుడు క్రిష్ తప్పుకోవడంతో సౌత్ లో ప్రమోషన్స్ లో కంగనా ఎక్కువగా పాల్గొనలేదు. సినిమా రిలీజ్ కు ముందే శాటిలైట్ డిజిటల్ రూపంలో మంచి లాభాలను అందుకుంది. 

70కోట్ల బడ్జెట్ తో నిర్మించిన మణికర్ణిక మొత్తంగా 150 కోట్ల ప్రాఫిట్స్ అందినట్లు తెలుస్తోంది. కంగనా కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమానే కాకుండా ఇండియన్ హిస్టారికల్ ఫిలిమ్స్ లో మణికర్ణిక కూడా బాక్స్ ఆఫీస్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే సౌత్ లో మాత్రం సినిమాకు గట్టిదెబ్బే పడినట్లు అర్ధమవుతోంది. 

click me!