‘పొన్నియిన్ సెల్వన్ -1’లో ఆకట్టుకుంటున్న యుద్ధ సన్నివేశాలు.. అన్ని భాషల్లో టీజర్ రిలీజ్

Published : Jul 08, 2022, 07:37 PM IST
 ‘పొన్నియిన్ సెల్వన్ -1’లో ఆకట్టుకుంటున్న యుద్ధ సన్నివేశాలు.. అన్ని భాషల్లో టీజర్ రిలీజ్

సారాంశం

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ : మొదటి భాగం’. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ లోని యుద్ధ సన్నివేశాలు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి.

 

డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ : మొదటి భాగం’ (PS 1) రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ పీరియాడ్ యాక్షన్ డ్రామాలో కోలీవుడ్ స్టార్స్ విక్రమ్ (Vikram), కార్తీ, జయం రవి పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీటి జోడీగా బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan), త్రిష, శోభితా ధూళిపాళ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వీరి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ భారీ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు చెన్సై లో Ponniyin Selvan : 1 టీజర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజర్ అథితుల చేతుల మీదుగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. టీజర్ (PS 1 Teaser).. దక్షిణ భారతదేశాన్ని పాలించిన శక్తివంతమైన రాజు అరుల్మొళివర్మన్ ప్రారంభ రోజులను వివరిస్తూ  ప్రారంభం అవుతోంది. ఆయనే చోళ చక్రవర్తిగా మారాడని తెలుస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు, సముద్రంలో ప్రయాణించే నౌకలకు సంబంధించిన షాట్స్ ఆకట్టుకుంటున్నాయి. 

మణిరత్నం దర్శక ప్రతిభ మరోసారి ఇండియాతో పాటు ప్రపంచానికి తెలియనుంది. టీజర్ ప్రామీసింగ్ గా అనిపించడంతో పాటు చిత్రంపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. వీఎఫ్ఎక్స్, లోకేషన్స్, క్యాస్ట్యూమ్స్, భారీ సెట్స్, మ్యూజిక్ అద్భుతంగా అనిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్ సీన్లను అద్భుతంగా చిత్రీకరించారు. రీలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్నిమేకర్స్ భారీగా ప్రమోట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

1995లో తమిళ రచయిత కల్కి క్రిష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. అదే టైటిల్ త మణిరత్నం మూవీని చిత్రీకరించారు. సినిమా కథకు మణి రత్నంతో పాటు ఎలాంగో కుమారవేల్, బి. జయమోహన్ సహకారం అందించారు. దాదాపు రూ.500 కోట్లతో పొన్నియన్ సెల్వన్ ను రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్, మద్రాస్ టాకీస్  సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సెప్టెంబర్ 30న  తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?